విడుదలకు ముందే 'బద్రీనాధ్' చిత్రం కేరళలో సూపర్ రికార్డ్
ఓ డబ్బింగ్ చిత్రం కోటి పది లక్షలు పెట్టి కేరళలో కొనుగోలు చేయటం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. అక్కడ చిత్ర పరిశ్రమ ఈ విషయమై చర్చిస్తోంది. అల్లు అర్జున్ కి కేరళలో పెరిగిన మార్కెట్ కి అణుగుణంగా అక్కడ రక్తక్ ఫిలిమ్స్ వారు కోటి పదివక్షలు మొత్తం వెచ్చించి ఈ చిత్రం రైట్స్ ని సొంతం చేసుకున్నారు. అక్కడ యూత్ అంతా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నట్లు అందుకే అంత ఎక్కవ రేటు ఇచ్చినట్లు చెప్తున్నారు. వివి వినాయిక్ దర్సకత్వంలో రూపొందుతున్న బద్రీనాధ్ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేసింది. ఇప్పటికే అంతటా విడదలైన ట్రైలర్స్ దుమారం రేపుతున్నాయి. తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకే సారి విడుదల చేయాలని నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











