Bagheera Closing Collections: బఘీర క్లోజింగ్ కలెక్షన్లు.. ఎంత లాభం? నష్టమెంత?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై కేజీఎఫ్, కాంతార లాంటి గ్రేట్ సినిమాలను అందించిన నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మించిన చిత్రం బఘీర. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శ్రీ మురళీ, గ్లామరస్ హీరోయిన్ రుక్మిణీ వసంత్ జంటగా నటించారు. ఈ చిత్రానికి డీఆర్ సూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? థియేట్రికల్ రన్‌లో వసూలు చేసిన మొత్తం ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
పోలీస్ ఆఫీసరైన తండ్రి హీరోయిజాన్ని స్పూర్తిగా తీసుకొని ఐపీఎస్‌గా మారిన వేదాంగ్ నిజాయితీతోపాటు అక్రమార్కులకు సింహ స్వప్నంగా నిలుస్తాడు. అయితే పై అధికారులు, రాజకీయ నేతల ఒత్తిడి కారణంగా తాను నిర్వర్తించాల్సిన విధులను సక్రమంగా నిర్వహించలేకపోతాడు. దాంతో సూపర్ హీరోగా అవతారం ఎత్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని అక్రమార్కుల భరతం పడుతాడు. ఆ క్రమంలో ఏం జరిగిందనే విషయమే సినిమా కథ. అయితే వినడానికి పాత కథే అనిపించినా.. కొత్తగా ప్రజెంట్ చేసిన తీరు పూర్తిగా ఆకట్టుకొలేకపోయిందనే చెప్పాలి.

బఘీర యాక్షన్ థ్రిల్లర్‌ను హెంబలే ఫిల్మ్స్ రిచ్‌గా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 22 కోట్ల రూపాయలు వ్యాల్యూ కట్టారు. ఇక బఘీర చిత్రాన్ని హోంబలే సంస్థ కన్నడలో స్వయంగా రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళం, మలయాళంలో ఈ సినిమాను కమిషన్ బేస్ మీద డిస్ట్రిబ్యూట్ చేశారనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉండటంతో వరల్డ్ వైడ్‌గా సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
దీపావళీ కానుకగా వచ్చిన బఘీర సినిమా సెలవును సానుకూలంగా మార్చుకొన్నది. కన్నడలో మాత్రమే ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగలిగింది. దాంతో కొంత మేరకు మోస్తారు వసూళ్లను రాబట్టింది. అయితే వారాంతం తర్వాత ఈ మూవీ అదే జోష్‌ను కొనసాగించలేకపోయింది. దాంతో తొలివారమే బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

బఘీర మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో తొలి రోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.3 కోట్లు, మూడో రోజు 3.5 కోట్లు, 4వ రోజు 3 కోట్ల రూపాయలు వసూలుచేసింది. ఆ తర్వాత దాదాపు 60 శాతం కలెక్షన్లు క్షీణించడంతో 5వ రోజు 1 కోటి రూపాయలు, 6వ రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసింది. 7వ రోజు 60 లక్షల రూపాయలు నేషనల్ వైడ్‌గా రాబట్టింది.
కన్నడ వసూళ్ల విషయానికి వస్తే.. ఈ సినిమా 1వ రోజు 2.5 కోట్లు, 2వ రోజు 3 కోట్లు, 3వ రోజు 3.5 కోట్లు, 4వ రోజు 3 కోట్లు వసూలుచేసింది. తొలి వారాంతం తర్వాత 5వ రోజు 1 కోటి రూపాయలు, 6వ రోజు 1 కోటి రూపాయల వరకు కలెక్షన్లను రాబట్టింది. 7వ రోజు ఈ సినిమా 40 లక్షలు వసూలు చేసింది. 14.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
తెలుగు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 50 లక్షలు, రెండో రోజు 40 లక్షలు, మూడో రోజు 30 లక్షలు, నాలుగో రోజు 20 లక్షలు, ఐదో రోజు 13 లక్షల రూపాయలు, ఆరో రోజు 10 లక్షలు, 7వ రోజు 5 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా 1.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగులో దాదాపు భారీగా నష్టాల్లో ముగిసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కన్నడలో కూడా స్వల్ప నష్టాల్లో ముగిసే అవకాశం కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











