Bagheera Day 4 Collections: డిజాస్టర్ టాక్‌లోను బఘీర భారీ వసూళ్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించిన కథతో డీఆర్ సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం బఘీర. కన్నడలో స్టార్ హీరో, హీరయిన్లు శ్రీ మురళీ, రుక్మిణి వసంత్ జంటగా నటించిన ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ నిర్మించారు. దీపావళీ పండుగ కానుకగా అక్టోబర్ 31వ తేదీన రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

పోలీస్ కథతో, నిజాయితీ కూడిన ఆఫీసర్ క్యారిక్టర్‌తో ఇండియన్ సూపర్ హీరో సినిమాగా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. బఘీర సినిమాను రిచ్‌గా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా హోంబలే ఫిల్మ్స్ నిర్మించారు. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయలతో విజయ్ కిరంగదూర్ తెరకెక్కించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 22 కోట్ల రూపాయల షేర్‌గా వ్యాల్యూ కట్టారు.

Bagheera Movie 1st Weekend Box Office Collections Worldwide Srimurali movie struggling at GBOC

బఘీర సినిమాపై భారీ అంచనాలు కూడా ఉండటంతో వరల్డ్ వైడ్‌గా సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు . అయితే ఈ సినిమాలో శ్రీమురళీ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నప్పటీకి కథలో బలం లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది.కేవలం యాక్షన్‌పైనే కథ ఆధారపడి ఉండటంతో దాదాపు నెగిటివ్ టాక్ తెచ్చుకొన్నది. అయితే దీపావళీ సెలవులు ఈ సినిమాకు అనుకూలంగా మారాయి. తొలివారాంత ఈ సినిమా కలెక్షన్లు బాగున్నప్పటికీ.. సోమవారం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

కన్నడలో బఘీర చిత్రం నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా 2.5 కోట్ల రూపాయలు నికరంగా తొలి రోజున, రెండో రోజున 3 కోట్ల రూపాయలు, మూడో రోజున ఈ సినిమా 3.5 కోట్ల రూపాయలు నెట్, 4వ రోజున ఈ మూవీ 3.5 కోట్లు నెట్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా గత 4 రోజుల్లో 12.5 కోట్ల రూపాయలు నికరంగా, 25 కోట్ల గ్రాస్ వసూళ్లు కన్నడలో సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Bagheera Movie 1st Weekend Box Office Collections Worldwide Srimurali movie struggling at GBOC

తెలుగులో బఘీర మూవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అమరన్, లక్కీ భాస్కర్, క సినిమాలకు మంచి టాక్ రావడంతో వాటి ముందు ఈ మూవీ కలెక్షన్లపరంగా డీలా పడింది. ఆ పోటీని తట్టుకోలేక పేలవమైన కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా తొలి రోజు 50 లక్షలు, రెండో రోజు 40 లక్షలు, 3వ రోజు 40 లక్షలు, 4వ రోజు 50 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 1.8 కోట్ల రూపాయలు నెట్ సుమారుగా 3 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక వరల్డ్ వైడ్‌గా ఓవర్సీస్ వసూళ్లను కలుపుకొని బఘీర మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 5 కోట్లకుపైగా గ్రాస్, రెండో రోజు 5 కోట్ల గ్రాస్, 3వ రోజు 5.5 కోట్ల గ్రాస్, 4వ రోజు 6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ఈ చిత్రం 21 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X