Bagheera Day 1 Collections: బఘీర మూవీకి భారీ కలెక్షన్లు.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
దక్షిణ భారత దేశంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై కేజీఎఫ్, కాంతార లాంటి గ్రేట్ సినిమాలను అందించిన నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మించిన చిత్రం బఘీర. కన్నడలో స్టార్ హీరో శ్రీ మురళీ, గ్లామరస్ హీరోయిన్ రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ఈ చిత్రానికి డీఆర్ సూరి దర్శకత్వం వహించారు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించిన కథతో రూపొందిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బాక్సాఫీస్ వద్ద నమోదు చేస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
వేదాంగ్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తన ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి.. చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని అక్రమార్కులు, అరాచకవాదులపై ఉక్కుపాదం మోపితే ఎలాంటి పరిస్థితి ఉంటుందనే పాయింట్‌తో రూపొందిన చిత్రమిది. అయితే ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా రూపొందింది.

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను రిచ్‌గా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా హోంబలే నిర్మించారు. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 22 కోట్ల రూపాయల షేర్‌గా వ్యాల్యూ కట్టారు.
ఇక బఘీర చిత్రాన్ని హోంబలే సంస్థ కన్నడలో స్వయంగా రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళం, మలయాళంలో ఈ సినిమాను కమిషన్ బేస్ మీద డిస్ట్రిబ్యూట్ చేశారనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉండటంతో వరల్డ్ వైడ్‌గా సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Recommended Video

ప్రశాంత్ నీల్ భాగస్వామ్యం పంచుకొన్న ఈ సినిమాకు కన్నడ బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన లభిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ గట్టిగానే జరిగింది. దాంతో ఈ చిత్రం కన్నడలో 5 కోట్ల రూపాయల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల గ్రాస్ 4 కోట్ల షేర్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.
బఘీర మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా సుమారుగా 22 కోట్ల షేర్ అంటే.. సుమారుగా 44 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయాల్సి ఉంటుంది. దీపావళీ సందర్భంగా ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ లభించడంతో లాభాలకు చేరవయ్యే అవకాశం లభించింది. ఈ ఛాన్స్‌ను శ్రీమురళీ మూవీ కరెక్టుగా ఉపయోగించుకొంటుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











