Bagheera Day 2 Collections: బాక్సాఫీస్ సత్తా చాటుతున్న బఘీర.. ఏకంగా అన్ని కోట్ల కలెక్షన్లతో!
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించిన కథతో డీఆర్ సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం బఘీర. కన్నడ స్టార్ హీరో, హీరోయిన్లు శ్రీమురళి, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మించారు. దీపావళీ కానుకగా అక్టోబర్ 31వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా 2వ రోజు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరిస్థితి ఏమిటంటే?
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను రిచ్‌గా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా హోంబలే నిర్మించారు. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 22 కోట్ల రూపాయల షేర్‌గా వ్యాల్యూ కట్టారు. వరల్డ్ వైడ్‌గా సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

తమిళ, తెలుగు, హిందీ సినిమాల పోటీని తట్టుకొని బఘీర సినిమా తొలి రోజు కన్నడ భాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు నమోదు చేసింది. ఈ చిత్రం కన్నడలో 3 కోట్లు నికరంగా 6 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ట్రేడ్ పండితుల అంచనాలకు దిగువనే ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం.
ఇక తెలుగులో పెద్దగా ఈ మూవీ ప్రభావం చూపలేకపోయింది. ప్రశాంత్ నీల్ కథ అనే విషయం ఈ సినిమాకు పాజిటివ్ అయినప్పటికీ.. తెలుగులో లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్ల వేటలో వెనుకబడింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల నికరంగా, 1 కోటి రూపాయలు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా మరో కోటి రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 8 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

బఘీర చిత్రం రెండో రోజు కన్నడ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. మార్నింగ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 70 శాతం ఆక్యుపెన్సీ, ఫస్ట్ షోకు 75 శాతం ఆక్యుపెన్సీ, సెకండ్ షోకు 75 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. బెంగళూరులో 55 శాతం, కలబుర్గి 60 శాతం, మైసూర్‌లో 60 శాతం, కుందాపురాలో 90 శాతం, తుమకూరు 70 శాతం, మణిపాల్ 75 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.
బెంగళూరు, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో అమరన్, లక్కీ భాస్కర్, సింగం అగైన్, భూల్ భులయ్యా 3 చిత్రాల నుంచి భారీ పోటీని తట్టుకొని 2వ రోజు కూడా నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం 2వ రోజున 2 కోట్ల రూపాయలు కన్నడలో, తెలుగులో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 2 రోజుల్లో 11 నుంచి 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











