Bagheera Day 3 Collections: షాకింగ్‌గా బఘీర కలెక్షన్లు.. 3 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
కేజీఎఫ్ ఫేమ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథతో రూపొందిన బఘీర చిత్రం కన్నడ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. కన్నడలో స్టార్ హీరో శ్రీ మురళీ, గ్లామరస్ హీరోయిన్ రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ఈ చిత్రానికి డీఆర్ సూరి దర్శకత్వం వహించారు. దక్షిణ భారత దేశంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై కేజీఎఫ్, కాంతార లాంటి గ్రేట్ సినిమాలను అందించిన నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మించిన చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బాక్సాఫీస్ వద్ద నమోదు చేస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన బఘీర సినిమాను రిచ్‌గా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా హోంబలే ఫిల్మ్స్ నిర్మించారు. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయలతో విజయ్ కిరంగదూర్ తెరకెక్కించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 22 కోట్ల రూపాయల షేర్‌గా వ్యాల్యూ కట్టారు.

బఘీర సినిమాను హోంబలే సంస్థ కన్నడలో స్వయంగా రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళం, మలయాళంలో ఈ సినిమాను కమిషన్ బేస్ మీద డిస్ట్రిబ్యూట్ చేశారనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉండటంతో వరల్డ్ వైడ్‌గా సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో పోలీస్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాలో శ్రీమురళీ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. కానీ కథలో బలం లేకపోవడం మైనస్‌గా మారింది. కేవలం యాక్షన్‌పైనే కథ ఆధారపడి ఉండటంతో మిక్స్‌డ్ టాక్ నమోదైంది. అయితే దీపావళీ సెలవులు ఈ సినిమాకు అనుకూలంగా మారాయి. దాంతో నిలకడగా కలెక్షన్లను సాధిస్తున్నది.
బఘీర సినిమా తొలి రోజు భారీగా వసూళ్లను సాధించింది. మొదటి రోజు 4 కోట్ల రూపాయలు నికరంగా 8 కోట్లు గ్రాస్, రెండో రోజు 4.5 కోట్ల రూపాయలు నికరంగా 9 కోట్ల గ్రాస్, మూడో రోజు 5 కోట్లకుపైగా నికరంగా 10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 13.5 కోట్లకుపైగా నెట్, 27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
కన్నడలో ఈ చిత్రం 2.55 కోట్లు నికరంగా, 5 కోట్ల గ్రాస్, రెండో రోజు 3 కోట్లు నెట్ 6 కోట్ల గ్రాస్, మూడో రోజు 3.5 కోట్ల నికరంగా 7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కన్నడలో 9 కోట్లు నికరంగా 18 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో తొలి రోజు 50 లక్షలు నికరంగా 1 కోటి రూపాయలు గ్రాస్, రెండో రోజు 45 లక్షలు నికరంగా 90 లక్షల గ్రాస్, మూడో రోజు 50 లక్షలు నికరంగా 1 కోటి గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో షాకింగ్‌గా ఈ సినిమా వసూళ్లు నమోదు అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











