»   » జూలై 24 నుంచీ అక్కడా ‘బాహుబలి’ రచ్చ మొదలు

జూలై 24 నుంచీ అక్కడా ‘బాహుబలి’ రచ్చ మొదలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాహుబలి' చిత్రం ఇప్పటికే హౌస్ ఫుల్స్ తో రన్ అవుతూ రికార్డులు బ్రద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ ఓవర్ సీస్ వెర్షన్ ని రెడీ చేసి రిలీజ్ కు రెడీ చేసారు. జూలై 24 నుంచి అక్కడ విడుదల కానుంది. ఈ వెర్షన్ సైతం అక్కడ రికార్డులు బ్రద్దలు కొడుతుందని భావిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే...


బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు లిఖిస్తూ.. దూసుకుపోతున్న 'బాహుబలి' తెలుగు సినిమాని రూ.200 కోట్ల మైలురాయి దగ్గరకు చేర్చేసింది. కేవలం 5 రోజుల్లోనే ఈ ఘనత సాధించిన చిత్రంగా 'బాహుబలి' చరిత్ర సృష్టించింది.


మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి' రూ.220 కోట్లకు పైచిలుకు వసూళ్లు సాధించింది. హిందీ వెర్షన్‌ రూపంలో దాదాపు రూ.35 కోట్ల వసూళ్లు అందుకొంది. ఓ దక్షిణాది చిత్రం హిందీలో అనువాదమై ఈ స్థాయిలో వసూళ్లు దక్కించుకోవడం బాలీవుడ్‌ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. తొలి రోజే సరికొత్త రికార్డులను నెలకొల్పిన 'బాహుబలి' ఆ దూకుడు 5 రోజులూ కొనసాగించింది.


Bahubali Hindi Overseas release date

మరీ ముఖ్యంగా తొలి వారాంతంలో రూ. 105 కోట్ల షేర్‌ సాధించిన తొలి భారతీయ చిత్రంగా 'బాహుబలి' జెండా ఎగరేసింది. అంతకు ముందు 'ధూమ్‌' (రూ.100 కోట్లు), 'హ్యాపీ న్యూ ఇయర్‌' (రూ.99 కోట్లు) రికార్డు 'బాహుబలి' తిరగరాసినట్త్టెంది.


అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా 'రోబో' (రూ.290 కోట్లు) తొలిస్థానంలో ఉంది. ఇప్పుడు ఆ రికార్డు దిశగా 'బాహుబలి' దూసుకుపోతోంది. తొలి వారంలో కచ్చితంగా 'బాహుబలి' 'రోబో' రికార్డుని దాటుకెళ్లడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు లెక్కలుగడుతున్నాయి.


సాధారణంగా స్టార్‌ కథానాయకుల చిత్రాలు సోమవారం నుంచి కాస్త నెమ్మదిస్తాయి. అయితే 'బాహుబలి' మాత్రం సోమ, మంగళ, బుధవారాల్లోనూ తన దూకుడు చూపిస్తోంది. నాలుగోరోజు రూ.60 కోట్లు, 5వ రోజు 44 కోట్ల షేర్‌ సాధించి.. తన జోరు తగ్గలేదని నిరూపించింది. మరి భవిష్యత్తులో 'బాహుబలి' ఇంకెన్ని ప్రకంపనాలు సృష్టిస్తుందో చూడాలని ట్రేడ్ లో ఎదురుచూస్తున్నారు.


మరో ప్రక్క ప్రపంచవ్యాప్తంగా రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ వెర్షన్ పై దృష్టి పెట్టింది. అక్కడి వారి అంతర్జాతీయ నిపుణులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందులో బాగంగా...హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన Vincent Tabaillon అనే ఎడిటర్ ని ఎంపిక చేసారు.


Vincent Tabaillon గతంలో.."The Incredible Hulk", "Clash of the Titans", "Taken 2" and most recently, "Now You See Me" చిత్రాలకు పనిచేసారు. మొదట్లో ఫ్రెంచ్ చిత్రాలకు పనిచేసిన ఆయన ఇప్పుడు హాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. ఆయన ఎడిట్ చేసే ఈ చిత్రం ఫిలిం ఫెస్టివల్స్ కు వెళ్తుంది. అలాగే ఇక్కడ ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాసం ఉంది. ఒరిజనల్ చిత్రానికి దీనికి తేడా ఉంటుంది.

English summary
Baahubali-The Beginning, Director Rajamouli’s vision and execution has become a sensation in National level in India and across the world. Now this film hindi version Overseas release on July 24th.
Please Wait while comments are loading...