‘బాహుబలి’ప్రి రిలీజ్ బిజినెస్ అంతా?
హైదరాబాద్ : భారీ బడ్జెట్ తో, భారీ గ్రాఫిక్స్ తో హాలీవుడ్ చిత్రాలను తలపించే సెట్స్ తో రూపొందుతున్న భారీ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం షూటింగ్ స్టేజిలో ఉండగానే విపరీతమైన క్రేజ్ క్రియేట్ అవుతోంది. రాజమౌళి గత చిత్రాలు హిట్ కావటంతో ఈ చిత్రం బిజినెస్ పరంగానూ సంచనలం సృష్టిస్తోంది. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతూండటంతో డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద పెద్ద మొత్తాలతో ఈ చిత్రం నిర్మాతలను కలుస్తున్నారు. ఇప్పటివరకూ ఈ చిత్రం అయిన ప్రి రిలీజ్ వివరాలు ట్రేడ్ లో అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మీకు అందిస్తున్నాం.
ఏరియా NRA లేదా అడ్వాన్స్(కోట్లలో)

నైజాం 25
సీడెడ్ 13
వైజాగ్ 7.5
గుంటూరు 6.5
కృష్ణా 5
తూర్పు గోదావరి 5
పశ్చిమ గోదావరి 4.5
నెల్లూరు 3.5
మొత్తం షేరు 70 కోట్లు (కేవలం ఆంధ్రా + నైజాం)
కర్ణాటక 9 కోట్లు
మొత్తం 79 కోట్లు
ఇంకా ఓవర్ సీస్, ఇండియాలో మిగతా ప్రాంతాలు బిజినెస్ కావాల్సి ఉంది.
గమనిక: పైన చెప్పబడినవి కేవలం ట్రేడ్ లో ప్రచారంలో ఉన్న లెక్కలు మాత్రమే.
ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు.


Click it and Unblock the Notifications











