twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'లెజెండ్‌' కలెక్షన్స్ పరిస్ధితేంటి?

    By Srikanya
    |

    హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' చిత్రం శుక్రవారం విడుదలై మాస్ తో పాటు క్లాస్ ఫ్యామిలీ అడియెన్స్ ను కూడా ఆకట్టు కుంటూ ముందుకు దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కలెక్షన్స్ మంగళవారం కూడా స్టడీగానే ఉన్నాయి. ఎక్కడా డ్రాప్ అవటం జరగలేదు. దాదాపు అన్ని చోట్లా 80% ధియోటర్ ఆక్యుపేషన్ ఉంది. మొదటి వారం లోనే ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసే అవకాసం ఉంది.

    2014లో సరైన హిట్టు ఒక్కటీ లేదే అనుకుంటున్న తరుణంలో సరిగ్గా బోయపాటి 'లెజెండ్‌'ని రంగంలోకి దించాడు. ఈ ఏడాదిలోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని పరిశ్రమకు ఇచ్చాడు. అటు ప్రేక్షకుల్ని కేరింతలు కొట్టించాడు. ఈ క్రెడిట్‌ పూర్తిగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులదే. బాలయ్యలో అసలైన సింహాన్ని తెరపైకి తెచ్చాడు. యాక్షన్‌లో ఉగ్రనరసింహుడిని చూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు. లెజెండ్‌ గర్జనతో థియోటర్స్ మార్మోగిపోతున్నాయి. కుటుంబ ప్రేక్షకుల కోసం చక్కని సెంటిమెంట్‌ రంగరించి వదలటం ప్లస్ అయ్యింది.

    Bala Krishna's Legend gets a solid Day 5

    ముఖ్యంగా సెకండాఫ్ లో సెంటిమెంట్‌, ట్రెయిన్‌ ట్రాక్‌పై ఎపిసోడ్‌లో ప్రేమ సన్నివేశం ప్రేక్షకుడి గుండె పగిలిపోయే ఉద్వేగాన్ని ఇచ్చాయి. గుడిమెట్లపై బాలయ్య ఉగ్రరూపం యాక్షన్‌కే కొత్త హంగులు అద్దిందని అంతటా వినపడుతోంది. మాస్‌ యాక్షన్‌ ప్రియులకు ఇదో కన్నుల పండుగగా మారింది.

    ముఖ్యంగా రాజకీయాలు పుట్టిందే మా వంశంలో రా.. అని బాలయ్య గర్జించిన తీరు విశ్వనటసా ర్వభౌముడు ఎన్టీఆర్‌ని తలపించింది. లెక్కకు మిక్కిలిగా బాలయ్య విసిరిన పంచ్‌లకు థియేటర్లలో విజిల్స్‌ పడుతున్నాయి. ఇటు అభిమానులే కాక, అటు సామాన్య ప్రేక్షకుల్లోనూ హుషారు తెచ్చింది ఈ సినిమా. ఏపీతో పాటు చెన్నయ్‌, బెంగళూరు, విదేశాల్లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోందని సమాచారం. వారాహి చలనచిత్రం, 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి

    వారాహి చలన చిత్రం, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సంస్థలకు "లెజెండ్'' చిత్రం మరో భారీ హిట్ ను అందించింది. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుపై పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాల్లో నే కాకుండా ఓవర్ సీస్ లోనూ "లెజెండ్'' చిత్రం విజయఢంకా మ్రోగిస్తోందని వారు తెలిపారు.

    English summary
    Balakrishna, Sonal Chauhan, Radhika Apte starrer Legend directed by Boyapati Srinu is going great guns at box office. Legend is holding on, way above Trade expectations of Day 1. Whether or not it will touch 25Cr mark inside 1st week worldwide is remains to be seen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X