Balagam 10 Days Collections: బలగం పెను సంచలనం.. 10వ రోజు అన్ని కోట్లు.. దిల్ రాజు‌కు పెద్ద లాటరీనే!

గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో కాన్సెప్టు ఓరియెంటెడ్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. వీటికి ప్రేక్షకాదరణ కూడా భారీ స్థాయిలోనే లభిస్తోంది. దీంతో మరిన్ని కొత్త సినిమాలు రూపొందుతోన్నాయి. అలా వచ్చిన సినిమానే 'బలగం'. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సంప్రదాయాల నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు ఆరంభం నుంచే కలెక్షన్లు భారీ స్థాయిలో వసూలు అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో 'బలగం' మూవీ 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

మంచి కాన్సెప్టుతో వచ్చిన మూవీ

మంచి కాన్సెప్టుతో వచ్చిన మూవీ

టాలెంటెడ్ గాయ్ ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన చిత్రమే 'బలగం'. టాలీవుడ్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

పక్కా పల్లెటూరి కథతో రూపొందిన 'బలగం' మూవీ కాన్సెప్టు గురించి ముందే తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో గ్రాండ్‌గానే రిలీజ్ అయింది.

10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

సున్నితమైన అంశాలతో రూపొందిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు అత్యధికంగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే 10వ రోజైన ఆదివారం ఈ సినిమా ఏకంగా రూ. 2.36 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

10 రోజులకు కలిపి ఎంతొచ్చింది

10 రోజులకు కలిపి ఎంతొచ్చింది

'బలగం' మూవీ 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదిరిపోయే వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 6.96 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 4.55 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 11.51 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 5.27 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.51 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి పది రోజుల్లో రూ. 21 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.72 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 5.37 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

పల్లెటూరి భావోద్వేగాలతో రూపొందిన 'బలగం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, పది రోజుల్లో ఈ సినిమాకు రూ. 5.37 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.07 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

రికార్డు వసూళ్లు.. లాభం కూడా

రికార్డు వసూళ్లు.. లాభం కూడా


జబర్ధస్త్ కమెడియన్‌ వేణు డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన చిత్రమే 'బలగం'. ఈ సినిమాకు 10వ రోజు ఏకంగా రూ. 2.36 కోట్లు గ్రాస్ వసూలైంది. తద్వారా ఫుల్‌ రన్‌లో తొలిసారి భారీ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇక, ఈ చిత్రం ద్వారా నిర్మాత దిల్ రాజు పది రోజుల్లోనే ఏకంగా రూ. 4.07 కోట్లు లాభాలను సొంతం చేసుకుని మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X