Balagam 15 Days Collections: బలగం దండయాత్ర.. 15 రోజుల్లోనే అన్ని కోట్లు.. లాభాలతో దిల్ రాజు సంచలనం

కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాలైనా హిట్ అవుతాయని చాలా సార్లు నిరూపణ అయింది. అందుకే కొందరు రియలిస్టిక్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తద్వారా విజయాలను అందుకుంటోన్నారు. ఇప్పుడు అలా విడుదలైన సినిమానే 'బలగం'.

తెలంగాణలోని పల్లె ప్రాంతాల్లో కనిపించే సంప్రదాయాల నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు ఆరంభం నుంచే కలెక్షన్లు భారీ స్థాయిలో వసూలు అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో 'బలగం' మూవీ 15 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

నేచురల్ స్టోరీతో వచ్చిన మూవీ

నేచురల్ స్టోరీతో వచ్చిన మూవీ

ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'బలగం'. జబర్ధస్త్ ద్వారా ఫేమస్ అయిన కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

తెలంగాణ పల్లె ప్రాంతాల్లోని కథతో వచ్చిన 'బలగం' మూవీ కాన్సెప్టు గురించి ముందే తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో గ్రాండ్‌గానే విడుదలైంది.

15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

నిజ జీవిత కథల ఆధారంగా రూపొందిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు అత్యధికంగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే 15వ రోజైన శుక్రవారం ఈ సినిమా ఏకంగా రూ. 48 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

15 రోజులకు కలిపి ఎంతొచ్చింది

15 రోజులకు కలిపి ఎంతొచ్చింది

15 రోజుల్లో 'బలగం' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదిరిపోయే వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 9.75 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 5.60 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 15.35 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 7 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల్లో రూ. 15.35 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 15 రోజుల్లో రూ. 35 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.70 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 7.16 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

దిల్ రాజు బ్యానర్‌లో రూపొందిన 'బలగం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లో ఈ సినిమాకు రూ. 7.16 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.86 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

అదే స్పీడు.. లాభాలే లాభాలు

అదే స్పీడు.. లాభాలే లాభాలు

జబర్ధస్త్ కమెడియన్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమే 'బలగం'. ఈ సినిమాకు 15వ రోజు కూడా ఈ చిత్రం రూ. 50 లక్షలు వరకూ వసూళ్లు రాబట్టింది. ఇక, ఈ చిత్రం ద్వారా నిర్మాత దిల్ రాజు పదిహేను రోజుల్లోనే ఏకంగా రూ. 5.86 కోట్లు లాభాలను రాబట్టింది. తద్వారా నాలుగు రెట్ల ప్రాఫిట్స్‌ను ఖాతాలో వేసుకున్న చిత్రం ఇది రికార్డును క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X