Balagam 16 Days Collections: బలగం మాస్ కొట్టుడు.. 16వ రోజు డబుల్.. దిల్ రాజుకు మరో జాక్‌పాట్
ఈ మధ్య కాలంలో చిన్న, పెద్ద సినిమాలు అంటూ ఏమీ లేవు. కంటెంట్ బాగుంటే ఎంత తక్కువ బడ్జెట్ మూవీ అయినా భారీ విజయాలను సొంతం చేసుకుంటోన్నాయి. అలా ఇటీవలే విడుదలైన సినిమానే 'బలగం'. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని సంప్రదాయాలకు అద్దం పట్టే కథతో రూపొందిన ఈ చిత్రానికి ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే శనివారం వసూళ్లు డబుల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'బలగం' మూవీ 16 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి!

పక్క పల్లెటూరి కథతో వచ్చింది
టాలెంటెడ్ గాయ్ ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'బలగం'. జబర్ధస్త్ ద్వారా ఫేమస్ అయిన కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్
పల్లెటూరి కథతో చిన్న బడ్జెట్‌తో రూపొందిన 'బలగం' మూవీ కాన్సెప్టు గురించి ముందే తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.16 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో దీన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు.

16వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
తెలంగాణ ఏరియాలోని రియల్ స్టోరీతో రూపొందిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే 16వ రోజైన శనివారం ఈ సినిమా ఏకంగా రూ. 91 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

16 రోజులకు కలిపి ఎంతొచ్చింది
'బలగం' మూవీ 16 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదిరిపోయే వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 10.40 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 5.86 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 16.26 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 7.40 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
16 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.26 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 16 రోజుల్లో రూ. 37 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.63 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 7.57 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?
దిల్ రాజు ప్రొడక్షన్‌లో తెరకెక్కిన 'బలగం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.16 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో ఈ సినిమాకు రూ. 7.57 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.27 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

మళ్లీ దూకుడు.. లాభాల పంట
ఫేమస్ కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన రియలిస్టిక్ మూవీనే 'బలగం'. ఈ సినిమాకు 16వ రోజు కూడా రూ. 91 లక్షలు వరకూ వసూళ్లు రాబట్టింది. ఇక, ఈ చిత్రం ద్వారా నిర్మాత దిల్ రాజు పదహారు రోజుల్లోనే ఏకంగా రూ. 6.27 కోట్లు లాభాలను రాబట్టింది. తద్వారా ఐదు రెట్ల ప్రాఫిట్స్‌ను ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











