Balagam 17 Days Collections: సండే సంచలన వసూళ్లు.. బలగం మూవీ ఊచకోత.. దిల్ రాజు లాభం తెలిస్తే!

తెలుగులో కొంత కాలంగా సున్నితమైన నిజ జీవిత కథలతో ప్రయోగాత్మక చిత్రాలు రూపొందుతోన్నాయి. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో దర్శక నిర్మాతలు అలాంటి సినిమాలను ఎక్కువగా చేస్తోన్నారు. ఇప్పుడలా వచ్చిన చిత్రమే 'బలగం'. పక్కా పల్లెటూరి కథతో రూపొందిన ఈ సినిమాకు మొదటి నుంచీ అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ మూవీకి మొదటి రోజు నుంచే కలెక్షన్లు భారీ స్థాయిలో పోటెత్తుతున్నాయి. ఇలా ఆదివారం మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో 'బలగం' 17 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

రియల్ స్టోరీతో వచ్చిన బలగం

రియల్ స్టోరీతో వచ్చిన బలగం

ప్రముఖ జబర్ధస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి రూపొందించిన తాజా చిత్రమే 'బలగం'. ఇందులో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు. భీమ్స్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

సున్నితమైన కథాంశంతో తెరకెక్కిన 'బలగం' మూవీ కాన్సెప్టు గురించి ముందే తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.17 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

17వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

17వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

పక్కా పల్లెటూరి కథతో ఎంతో ఎమోషనల్‌గా రూపొందిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే 17వ రోజైన ఆదివారం ఇది ఏకంగా రూ. 1.82 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

17 రోజులకు కలిపి ఎంతొచ్చింది

17 రోజులకు కలిపి ఎంతొచ్చింది

17 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'బలగం' మూవీ అదిరిపోయే వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 11.76 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 6.32 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 18.08 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 8.24 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో రూ. 18.08 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 17 రోజుల్లో రూ. 40 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.48 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 8.32 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన 'బలగం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లో ఈ సినిమాకు రూ. 8.32 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 7.02 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

మరో సంచలనం.. 7 కోట్లతో

మరో సంచలనం.. 7 కోట్లతో

టాలీవుడ్ కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'బలగం'. ఈ సినిమాకు 17వ రోజు కూడా రూ. 1.82 కోట్లు వరకూ వసూళ్లు అయ్యాయి. తద్వారా ఇప్పటి వరకూ ఈ చిత్రం రెండో అత్యధిక మొత్తాన్ని వసూలు చేసినట్లు అయింది. అలాగే, ఈ చిత్రం ఇప్పటికే రూ. 7 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది. అంటే బడ్జెట్‌కు ఆరు రెట్లు లాభాలను అందుకున్నట్లైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X