Balagam 1st Week Collections: 1.30 కోట్ల టార్గెట్.. వారంలో రికార్డు వసూళ్లు.. దిల్ రాజుకు జాక్‌పాట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా నేచురల్ స్టోరీలతో సినిమాలు తెరకెక్కుతోన్నాయి. తద్వారా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించడంతో పాటు విజయాలను కూడా సొంతం చేసుకుంటోన్నాడు. అలాంటి కోవలోకి చెందిన చిత్రమే 'బలగం'. తెలంగాణలోని పల్లె సంస్కృతికి అద్దం పట్టే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా దీనికి కలెక్షన్లు అత్యధికంగా వస్తున్నాయి. అయితే, ఆరో రోజు కాస్త తగ్గినా ప్రభావాన్ని చూపించింది. మరి ఈ మూవీ వారం రోజుల రిపోర్టును చూస్తారా!

నేచురల్ స్టోరీతో ‘బలగం'
ప్రముఖ నటుడు ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రమే 'బలగం'. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్
సందేశాత్మకమైన కథతో రూపొందిన 'బలగం' మూవీ కాన్సెప్టు గురించి తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో అన్ని ప్రాంతాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
బలమైన కథతో తెరకెక్కిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆరంభం నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ చిత్రానికి భారీ వసూళ్లే వస్తున్నాయి. ఈ క్రమంలోనే 6వ రోజైన గురువారం ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో రూ. 58 లక్షలు గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.

7 రోజులకు కలిపి ఎంతొచ్చింది
'బలగం' మూవీ వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదిరిపోయే వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 4.16 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 2.76 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 6.92 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 3.00 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.92 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం'.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి వారం రోజుల్లో రూ. 14 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.06 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 3.07 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?
గ్రామీణ ప్రాంతంలోని కథతో వచ్చిన 'బలగం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో ఈ సినిమాకు రూ. 3.07 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.77 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

వారంలోనే రికార్డు స్థాయిలో
కమెడియన్‌గా పేరొందిన వేణు తెరకెక్కించిన చిత్రమే 'బలగం'. మంచి కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడంతో దీని రేంజ్ పెరిగింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇలా వారంలోనే ఈ సినిమా రూ. 3 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టి సత్తా చాటింది. అలాగే, నిర్మాతలకు రూ. 2 కోట్లు వరకూ లాభాలనూ అందించింది.


Click it and Unblock the Notifications











