Balagam 23 Days Collections: ఓటీటీకి వచ్చినా ఊచకోతే.. 23వ రోజూ భారీ వసూళ్లు.. దిల్ రాజు లాభం ఎంతంటే!
కాన్సెప్టు ఆధారంగా వచ్చే చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో రియలిస్టిక్ స్టోరీలతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అలా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'బలగం'. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే కొన్ని సామాన్య, సున్నితమైన అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'బలగం' మూవీ 23 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరు కూడా చూసేయండి!

అదిరిపోయే కంటెంట్‌తో బలగం
టాలీవుడ్‌లో పేరున్న కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కిన ఎమోషనల్ మూవీనే 'బలగం'. ఇందులో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కనిపించారు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్
ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'బలగం' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.23 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో దీన్ని గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

23వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
సున్నితమైన అంశాలతో రూపొందించిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీలో విడుదలైనా ఇది 23వ రోజు ఊహించని విధంగా రూ. 63 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

23 రోజులకు కలిపి ఎంతొచ్చింది
23 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'బలగం' మూవీ అదిరిపోయే వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 15.82 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 7.35 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 23.17 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 10.61 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
తెలుగు రాష్ట్రాల్లో 23 రోజుల్లో రూ. 23.17 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 23 రోజుల్లో రూ. 42 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.59 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 10.81 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?
దిల్ రాజు ప్రొడక్షన్‌లో వచ్చిన 'బలగం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, 23 రోజుల్లో ఈ సినిమాకు రూ. 10.81 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 9.51 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

ఓటీటీలో వచ్చినా భారీగానే
జబర్ధస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'బలగం'. ఈ సినిమాను 3 వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ 22వ రోజు భారీ వసూళ్లను రాబట్టింది. అదే కంటిన్యూ చేస్తూ 23వ రోజున ఏకంగా రూ. 63 లక్షలు రాబట్టింది. ఇలా ఈ చిత్రం థియేటర్లలోనూ దుమ్ము దులుపుతోంది. ఫలితంగా లాభాలను అందుకుంటోంది.


Click it and Unblock the Notifications











