Balagam 24 Days Collections: మళ్ళీ పెరిగిన కలెక్షన్స్.. దిల్ రాజు లక్కు మాములుగా లేదుగా!
పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్నాయి ఇక అదే తరహాలో సింపుల్ గా తక్కువ థియేటర్లలో విడుదలైన బలగం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయేలా కలెక్షన్స్ సొంతం చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మూడు వారాల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తగ్గడం లేదు. అంతేకాకుండా ఓటీపీలో కూడా ఈ సినిమాను విడుదల చేశారు అయినా కూడా థియేటర్లో సినిమాను చూసేందుకు జనాలు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు పూర్తి వివరాల్లోకి వెళితే..

హృదయాలను తాకిన బలగం
మంచి కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వేణు జబర్దస్త్ ద్వారా కూడా తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. అయితే ఈసారి అతను డైరెక్షన్లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే అందరి హృదయాలను ఎంతగానో ఆకట్టుకున్నాడు. పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన బలగం సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇక ఈ సినిమా ఓటీటీలో విడుదలైన కూడా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్
దిల్ రాజు ప్రొడక్షన్ లో నిర్మించిన 'బలగం' విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. ఇక ఎంతో అనుభవం కలిగిన దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక బలగం సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.23 కోట్లు బిజినెస్ జరిగింది.

24వ రోజు వచ్చిన కలెక్షన్స్
ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి కామెడీ ఉండడంతో సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. 'బలగం' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. రెండు రోజుల క్రితం ఓటీటీలో విడుదలైనా ఇది 24వ రోజు ఊహించని విధంగా రూ. 68 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

24 రోజుల ఏపీ నైజాం టోటల్
24 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'బలగం' సినిమా అదిరిపోయే వసూళ్లనే అందుకుంది. ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 16.31 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 7.54 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 23.85 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 10.93 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో మూడు వారాలు అయినా బలగం కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. 24 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 23 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 24 రోజుల్లో రూ. 42 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే బలగం ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.27 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 11.13 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్
దిల్ రాజు ప్రొడక్షన్‌లో వచ్చిన 'బలగం'కు సినిమా దాని స్థాయికి అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. అయితే, 24 రోజుల్లో ఈ సినిమాకు రూ. 10.93 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 9.83 లాభాలు అందుకొని చిన్న సినిమాలలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీ లో విడుదలైన 2 రోజుల తరువాత కూడా భారీగా కలెక్షన్స్ రావడం విశేషం.


Click it and Unblock the Notifications











