Balagam 26 Days Collections: ఓటీటీలో ఉన్నా కుమ్ముడే.. 26వ రోజూ లక్షల్లో.. లాభాలతో దిల్ రాజు రికార్డు

మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెలుగులో సరికొత్త కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. వీటికి మంచి ఆదరణ వచ్చి సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. దీంతో అదే తరహాలో మరిన్ని సినిమాలు రూపొందుతోన్నాయి.

ఇప్పుడు అలా వచ్చిన చిత్రమే 'బలగం'. తెలంగాణలోని పల్లెల్లో కనిపించే సంప్రదాయలతో తీసిన ఈ సినిమాకు ఆరంభం నుంచే అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఓటీటీలోకి వచ్చినా ఈ సినిమాకు కలెక్షన్లు భారీగానే దక్కుతోన్నాయి. ఈ నేపథ్యంలో 'బలగం' మూవీ 26 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరు కూడా చూసేయండి!

మంచి కాన్సెప్టుతో వచ్చిన మూవీ

మంచి కాన్సెప్టుతో వచ్చిన మూవీ

జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కిన ఎమోషనల్ మూవీనే 'బలగం'. ఇందులో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు.

 బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

పక్కా పల్లెటూరి కథతో రూపొందిన 'బలగం' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో దీన్ని గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశారు.

26వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

26వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

కామెడీ, ఎమోషన్స్‌తో కుటుంబ కథతో వచ్చిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో దీనికి వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీలో ఉన్నా ఇది 26వ రోజు ఊహించని విధంగా రూ. 45 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

 26 రోజులకు కలిపి ఎంతొచ్చింది

26 రోజులకు కలిపి ఎంతొచ్చింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 26 రోజుల్లో 'బలగం' మూవీ అదిరిపోయే వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 17.10 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 7.64 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 24.74 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 11.35 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

26 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 24.74 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 26 రోజుల్లో రూ. 42 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.16 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 11.55 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన 'బలగం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, 26 రోజుల్లో ఈ సినిమాకు రూ. 11.55 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10.24 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

ఓటీటీలో ఉన్నా.. రికార్డు లాభం

ఓటీటీలో ఉన్నా.. రికార్డు లాభం

వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'బలగం'. ఈ సినిమాను 3 వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ 26వ రోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఇలా ఈ చిత్రం ఇప్పటికే రూ. 10 కోట్ల లాభాల మార్కును చేరుకుంది. తద్వారా తక్కువ బడ్జెట్‌తో వచ్చి ఎక్కువ లాభాలను అందించిన చిత్రాల జాబితాలో ఇది చేరిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X