Balagam 27 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. 27వ రోజూ ఊచకోత.. దిల్ రాజు కూతురి లాభం ఎంతంటే!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో కొత్త కొత్త అంశాలతో సినిమాలు రూపొందుతోన్నాయి. వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో అలాంటి తరహాలో మరిన్ని చిత్రాలు వస్తున్నాయి. ఇటీవలే అలా వచ్చిన సినిమానే 'బలగం'.
తెలంగాణలోని పల్లెల్లో కనిపించే సంప్రదాయలతో తీసిన ఈ సినిమాకు ఆరంభం నుంచే అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఓటీటీలోకి వచ్చినా ఈ సినిమాకు కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బలగం' మూవీ 27 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరు కూడా లుక్కేయండి!

దిల్ రాజు బ్యానర్‌లో వచ్చింది
ప్రముఖ హాస్య నటుడు వేణు దర్శకుడిగా మారి తెరకెక్కిన ఎమోషనల్ మూవీనే 'బలగం'. ఇందులో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్
తెలంగాణలోని సంప్రదాయాలకు అద్ధం పట్టే 'బలగం' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో దీన్ని గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

27వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
హాస్యం, భావోద్వేగాలతో కుటుంబ కథా చిత్రంగా వచ్చిన 'బలగం'కు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో దీనికి వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీలో ఉన్నా ఇది 27వ రోజు ఏకంగా రూ. 54 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసి సత్తా చాటింది.

27 రోజులకు కలిపి ఎంతొచ్చింది
27 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'బలగం' మూవీ అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 17.48 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 7.80 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 25.28 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 11.62 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
తెలుగు రాష్ట్రాల్లో 27 రోజుల్లో రూ. 25.28 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 27 రోజుల్లో రూ. 42 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.70 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 11.82 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?
దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చిన 'బలగం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, 27 రోజుల్లో ఈ సినిమాకు రూ. 11.82 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10.52 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

ఓటీటీలో ఉన్నా.. లాభాలతో
కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'బలగం'. దీన్ని దిల్ రాజు కుమార్తె నిర్మించారు. ఇక, ఈ సినిమాను 3 వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ 27వ రోజు కూడా అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇలా ఈ చిత్రం ఇప్పటికే రూ. 10.50 కోట్ల లాభాల మార్కును చేరుకుని మరో అరుదైన ఘనతను అందుకుంది.


Click it and Unblock the Notifications











