Balagam 29 Days Collections: 29వ రోజూ షాకింగ్‌గా.. ఆ మైలురాయిని దాటి.. దిల్ రాజుకు కోట్ల జాక్‌పాట్
గతంలో మాదిరిగా ఇప్పుడు చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఏమీ లేవు. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రానికైనా తెలుగు ప్రేక్షకులు ఆదరణను అందిస్తున్నారు. తద్వారా అలాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు అలా వచ్చి సక్సెస్‌ను సొంతం చేసుకున్న మూవీనే 'బలగం'. పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాకు నాలుగు వారాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఈ క్రమంలోనే ఐదో వారంలో మాత్రం కలెక్షన్లు కాస్త తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో 'బలగం' మూవీ 29 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరు కూడా చూసేయండి!

నిజ జీవిత కథతో వచ్చిన మూవీ
టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కిన ఎమోషనల్ మూవీనే 'బలగం'. ఇందులో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. భీమ్స్ సంగీతాన్ని అందించాడు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్
తెలంగాణలోని గ్రామీణ సంప్రదాయాలను గుర్తు చేసేలా వచ్చిన 'బలగం' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

29వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
ఎన్నో ఎమోషన్స్‌తో కూడిన కుటుంబ కథా చిత్రంగా వచ్చిన 'బలగం'కు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో దీనికి వసూళ్లు భారీగా వస్తున్నాయి. కానీ, 29వ రోజు మాత్రం ఈ సినిమాకు కేవలం రూ. 22 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

29 రోజులకు కలిపి ఎంతొచ్చింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 29 రోజుల్లో 'బలగం' మూవీ అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 17.88 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 7.93 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 25.81 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 11.87 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
29 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.81 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 29 రోజుల్లో రూ. 42 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 26.23 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 12.07 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?
దిల్ రాజు బ్యానర్‌లో రూపొందిన 'బలగం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, 29 రోజుల్లో ఈ సినిమాకు రూ. 12.07 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10.77 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











