Balagam 3 Weeks Collections: చరిత్ర సృష్టించిన బలగం.. 3 వారాల్లో అన్ని కోట్లు.. దిల్ రాజు లక్కీ బాసూ

తెలుగు సినీ ప్రియుల అభిరుచిలో మార్పులు వస్తుండడంతో కొత్త కాన్సెప్టులతో వచ్చే చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా రియల్ ఇన్సిడెంట్లతో రూపొందే సినిమాలు మంచి విజయాలను అందుకుంటోన్నాయి. దీనికి ఉదాహరణగా నిలిచిన చిత్రమే 'బలగం'. తెలంగాణలోని పల్లెల్లో కనిపించే రియలిస్టిక్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీకి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో మూడు వారాల్లోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో వసూళ్లు దక్కాయి. ఈ నేపథ్యంలో 'బలగం' మూవీ 21 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరు కూడా చూసేయండి మరి!

ఎమోషనల్ కంటెంట్‌తో బలగం

ఎమోషనల్ కంటెంట్‌తో బలగం

జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కిన ఎమోషనల్ మూవీనే 'బలగం'. ఇందులో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

సున్నితమైన అంశాల మేళవింపుతో రూపొందిన 'బలగం' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.21 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో దీన్ని గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

21వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

21వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

క్రేజీ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే 21వ రోజు భారీగా పడిపోయి రూ. 66 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

3 వారాలకు కలిపి ఎంతొచ్చింది

3 వారాలకు కలిపి ఎంతొచ్చింది

3 వారాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'బలగం' మూవీ అదిరిపోయే వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 14.90 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 7.07 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 21.97 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 10.05 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

తెలుగు రాష్ట్రాల్లో 3 వారాల్లో రూ. 21.97 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 21 రోజుల్లో రూ. 42 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.39 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 10.25 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

టార్గెట్ ఇలా... లాభం ఎంత?


దిల్ రాజు బ్యానర్‌లో రూపొందిన 'బలగం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, 3 వారాల్లో ఈ సినిమాకు రూ. 10.25 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 8.95 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

చరిత్ర సృష్టించి.. ఓటీటీలో

చరిత్ర సృష్టించి.. ఓటీటీలో

కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'బలగం'. ఈ సినిమాకు 3 వారాల్లోనే ఏకంగా రూ. 10.25 కోట్లు షేర్ వసూలైంది. తద్వారా తక్కువ బడ్జెట్‌తో వచ్చి ఎక్కువ లాభాలను అందుకుని ఈ చిత్రం చరిత్రను సృష్టించింది. అయితే, ఇప్పటికీ భారీ కలెక్షన్లు వస్తున్నా.. 'బలగం' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X