Balagam 30 Days Collections: 30వ రోజూ ఊహించని విధంగా.. ఎక్కడ 1.30 కోట్లు.. ఎక్కడ 10.90 కోట్లు సామీ!

తెలుగులో గతంలో కంటే ఇప్పుడు మంచి కాన్సెప్టు ఓరియెంటెడ్ చిత్రాలు వస్తున్నాయి. రియల్ స్టోరీలతో తెరకెక్కుతోన్న ఇలాంటి సినిమాలకు ప్రేక్షకులు భారీ స్పందనను అందిస్తుండడంతో దర్శక నిర్మాతలు ఇలాంటి ప్రయోగాలతో ముందుకు వస్తున్నారు. అలా ఇటీవలే వచ్చిన సినిమానే 'బలగం'. పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాకు నాలుగు వారాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఈ క్రమంలోనే 29వ రోజు కాస్త తగ్గినా.. శనివారం మాత్రం మళ్లీ పెరిగాయి. ఈ పరిస్థితుల్లో 'బలగం' మూవీ 30 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరు కూడా చూసేయండి!

మంచి కాన్సెప్టుతో వచ్చిన మూవీ

మంచి కాన్సెప్టుతో వచ్చిన మూవీ

ప్రముఖ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి రూపొందించిన ఎమోషనల్ మూవీనే 'బలగం'. ఇందులో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. భీమ్స్ సంగీతాన్ని ఇచ్చాడు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

తెలంగాణలోని పల్లెల్లో కనిపించే సాదారణ అంశాలను గుర్తు చేస్తూ తెరకెక్కిన 'బలగం' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో గ్రాండ్‌గా విడుదలైంది.

30వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

30వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

ఫన్ అండ్ ఎమోషన్స్‌తో కూడి కుటుంబ కథా చిత్రంగా వచ్చిన 'బలగం'కు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. అయితే, దీనికి క్రమంగా డౌన్ అవుతోన్నాయి. కానీ, 30వ రోజు మాత్రం కాస్త పెరిగి ఈ సినిమా రూ. 27 లక్షలు గ్రాస్‌‌ను వసూలు చేసింది.

30 రోజులకు కలిపి ఎంతొచ్చింది

30 రోజులకు కలిపి ఎంతొచ్చింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'బలగం' మూవీ 30 రోజుల్లో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 18.08 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 8.00 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 26.08 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 12.00 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

30 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 26.08 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 30 రోజుల్లో రూ. 42 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 26.50 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 12.20 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

దిల్ రాజు ప్రొడక్షన్‌లో రూపొందిన 'బలగం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, 30 రోజుల్లో ఈ సినిమాకు రూ. 12.20 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10.90 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X