Balagam 31 Days Collections: బలగం సంచలన రికార్డు.. 31 రోజుల్లో అన్ని కోట్లు.. లక్ అంటే దిల్ రాజుదే!

పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌తో, సహజ సిద్ధమైన క్యారెక్టర్లతో, పాత రోజులను గుర్తు చేసే సన్నివేశాలతో తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ సినిమాలే వస్తున్నాయి. అందుకే ఆ తరహాలో వచ్చిన మూవీలకు మంచి రెస్పాన్స్ వచ్చి సక్సెస్ అవుతోన్నాయి. ఇప్పుడలా వచ్చి విజయాన్ని అందుకున్న సినిమానే 'బలగం'. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సాధారణమైన అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి వసూళ్లు వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ సండే మాత్రం మరింత డౌన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'బలగం' మూవీ 31 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!

పక్కా పల్లెటూరి కథతో బలగం

పక్కా పల్లెటూరి కథతో బలగం

టాలీవుడ్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి రూపొందించిన ఎమోషనల్ మూవీనే 'బలగం'. ఇందులో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. భీమ్స్ దీనికి మ్యూజిక్ అందించాడు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

సున్నితమైన అంశాలతో ఎంతో ఫన్ అండ్ ఎమోషనల్‌గా రూపొందిన 'బలగం' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఇది గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

31వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

31వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

పూర్తి స్థాయి కుటుంబ కథతో తెరకెక్కిన 'బలగం' చిత్రానికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. అయితే, దీనికి క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే 31వ రోజు కూడా వసూళ్లు తగ్గిపోయాయి. ఫలితంగా సండే రూ. 24 లక్షలు గ్రాస్‌‌ మాత్రమే వచ్చింది.

31 రోజులకు కలిపి ఎంతొచ్చింది

31 రోజులకు కలిపి ఎంతొచ్చింది

31 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'బలగం' మూవీ అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 18.27 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 8.05 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 26.32 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 12.10 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

తెలుగు రాష్ట్రాల్లో 31 రోజుల్లో రూ. 26.32 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 31 రోజుల్లో రూ. 42 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 26.72 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 12.30 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

దిల్ రాజు ప్రొడక్షన్‌లో రూపొందిన 'బలగం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.31 కోట్లుగా నమోదైంది. ఇక, 31 రోజుల్లో ఈ సినిమాకు రూ. 12.30 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 11 కోట్ల లాభాలతో సంచలన రికార్డును క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X