Balagam 4 Days Collections: 4వ రోజూ భారీగా.. బలగం మూవీకి లాభాల పంట.. దిల్ రాజు మరో జాక్‌పాట్

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే రియలిస్టిక్ స్టోరీలతో తెలుగులో చాలా తక్కువ సినిమాలే వస్తుంటాయని చెప్పొచ్చు. అందుకే రూపొందిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తూ ఉంటుంది. ఇలా ఇప్పుడు ఆడియెన్స్ ముందుకు వచ్చిన మూవీనే 'బలగం'.

తెలంగాణ గ్రామీణ ప్రాంత పరిస్థితులకు అద్ధం పట్టే కథతో రూపొందిన ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా ఇది మూడో రోజే టార్గెట్‌ను చేరుకుంది. ఈ నేపథ్యంలో 'బలగం' మూవీకి నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో మీరే చూసేయండి మరి!

బలగం అంటూ వచ్చిన మూవీ

బలగం అంటూ వచ్చిన మూవీ

టాలెంటెడ్ ఆర్టిస్టు ప్రియదర్శి - కావ్య కల్యాణ్‌రామ్ జంటగా నటించిన సినిమానే 'బలగం'. కమెడియన్ వేణు రూపొందించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

పెద్ద స్టార్లు నటించకున్నా 'బలగం' మూవీ కాన్సెప్టు గురించి తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే విడుదలైంది.

4వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

4వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

మంచి కథతో రూపొందిన 'బలగం' మూవీకి మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆరంభం నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదిరిపోయే స్పందన లభిస్తోంది. దీంతో మొదటి వీకెండ్‌లో రెండు రాష్ట్రాల్లో కలిపి దీనికి భారీ వసూళ్లే వచ్చాయి. అదే కంటిన్యూ చేస్తూ 4వ రోజైన సోమవారం కూడా దీనికి రూ. 58 లక్షలు గ్రాస్ వసూలైంది.

4 రోజులకు కలిపి ఎంతొచ్చింది

4 రోజులకు కలిపి ఎంతొచ్చింది

అంధ్రప్రదేశ్, తెలంగాణలో 'బలగం' మూవీ నాలుగు రోజుల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 2.45 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 1.23 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 3.68 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 1.55 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.68 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ చక్కగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి నాలుగు రోజుల్లో రూ. 7 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.75 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 1.56 కోట్లు షేర్ కలెక్ట్ వచ్చింది.

 టార్గెట్ ఇలా... లాభం ఎంత?

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

పల్లెటూరి నేపథ్యంతో రూపొందిన 'బలగం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో ఈ సినిమాకు రూ. 1.56 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 26 లక్షలు లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

దిల్ రాజుకు మరో జాక్‌పాట్

దిల్ రాజుకు మరో జాక్‌పాట్

కొంత కాలంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు పెద్దగా కలిసి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత సంక్రాంతికి 'వారసుడు'తో వచ్చిన ఆయన విజయాన్ని అందుకున్నారు. మళ్లీ ఇప్పుడు 'బలగం' మూవీతో మరో హిట్ కొట్టారు. అంతేకాదు, ఈ చిత్రానికి గానూ దిల్ రాజుకు మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X