Balagam 5 Days Collections: బలగం సంచలనం.. అన్ని రోజుల కంటే ఎక్కువ.. దిల్ రాజుకు లాభం ఎంతో తెలిస్తే!

గతంలో మాదిరిగా ఇప్పుడు చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా పెద్దగా కనిపించడం లేదు. కంటెంట్ బాగుంటే ఎలాంటి బడ్జెట్ మూవీనైనా ప్రేక్షకులు భారీ స్థాయిలో ఆదరించి సంచలన విజయాలను అందిస్తున్నారు. ఆ జాబితాలోకే వచ్చి చేరుతుంది తాజాగా విడుదలైన 'బలగం' మూవీ.

తెలంగాణ పల్లె సంప్రదాయాలకు అద్దం పడుతూ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆరంభం నుంచే కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఐదో రోజు ఈ మూవీకి సంచలన వసూళ్లు వచ్చాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? బలగం మూవీ 5 రోజుల రిపోర్టును మీరే చూడండి!

మంచి కంటెంట్‌తో ‘బలగం'

మంచి కంటెంట్‌తో ‘బలగం'

టాలెంటెడ్ గాయ్ ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమానే 'బలగం'. కమెడియన్ వేణు రూపొందించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

 బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

భారీ తారాగణం లేకపోయినా 'బలగం' మూవీ కాన్సెప్టు గురించి తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో గ్రాండ్‌గా విడుదలైంది.

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

మంచి కాన్సెప్టుతో తెరకెక్కిన 'బలగం' మూవీకి మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆరంభం నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో మొదటి వీకెండ్‌లో రెండు రాష్ట్రాల్లో కలిపి దీనికి భారీ వసూళ్లే వచ్చాయి. ఇక, 5వ రోజైన మంగళవారం ఇది రూ. 1.80 కోట్లు గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది.

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది

'బలగం' మూవీ ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణలో అదిరిపోయే వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 3.25 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 2.23 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 5.48 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 2.35 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో రూ. 5.48 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ చక్కగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి నాలుగు రోజుల్లో రూ. 10 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.58 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 2.40 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

గ్రామీణ నేపథ్యంతో రూపొందిన 'బలగం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో ఈ సినిమాకు రూ. 2.40 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.10 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

5వ రోజు సంచలనం.. లాభం

5వ రోజు సంచలనం.. లాభం

మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌గా పేరొందిన దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రమే 'బలగం'. మంచి కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీకి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐదో రోజు ఏకంగా 1.80 కోట్లు గ్రాస్ వచ్చింది. దీనికితోడు ఈ చిత్రం రూ. 1 కోటి లాభాల మార్కును కూడా చేరుకుంది. తద్వారా 'బలగం' మూవీ అరుదైన రికార్డులను నమోదు చేసుకుని దూసుకుపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X