Balagam 6 Days Collections: 6వ రోజూ భారీగా.. బలగంకు అప్పుడే అన్ని కోట్లు.. దిల్ రాజుకు లాభాల పంట
గతంలో కంటే ఇప్పుడు కాన్సెప్టు ఓరియెంటెడ్ మూవీలు టాలీవుడ్‌లో ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ఆ తరహా చిత్రాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రూపొందిన చిత్రమే 'బలగం'. తెలంగాణలోని గ్రామీణ వాతావరణానికి అద్దం పట్టే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా దీనికి కలెక్షన్లు అత్యధికంగా వస్తున్నాయి. అయితే, ఆరో రోజు కాస్త తగ్గినా ప్రభావాన్ని చూపించింది. మరి ఈ మూవీ 6 రోజుల రిపోర్టును చూసేద్దామా!

పల్లెటూరి స్టోరీతో ‘బలగం'
టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రమే 'బలగం'. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్
పెద్ద పెద్ద స్టార్లు నటించకపోయినా 'బలగం' మూవీ కాన్సెప్టు గురించి తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో అన్ని ప్రాంతాల్లో గ్రాండ్‌గా విడుదలైంది.

6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
రియల్ స్టోరీతో రూపొందిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆరంభం నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో మొదటి వీకెండ్‌లో రెండు రాష్ట్రాల్లో కలిపి దీనికి భారీ వసూళ్లే వచ్చాయి. ఇక, 6వ రోజైన బుధవారం ఇది రూ. 86 లక్షలు గ్రాస్ రాబట్టి సత్తాను నిరూపించుకుంది.

6 రోజులకు కలిపి ఎంతొచ్చింది
'బలగం' మూవీ ఆరు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదిరిపోయే వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 3.78 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 2.56 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 6.34 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 2.73 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.48 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం'.. ప్రపంచ వ్యాప్తంగానూ చక్కగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి ఆరు రోజుల్లో రూ. 12 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.46 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 2.78 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?
తెలంగాణ పల్లె కథతో రూపొందిన 'బలగం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో ఈ సినిమాకు రూ. 2.78కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.48 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

మంచి హోల్డ్.. లాభాల పంట
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రమే 'బలగం'. మంచి కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీకి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఆరో రోజు కూడా ఇది బాగానే హోల్డ్ చేసింది. దీనికితోడు ఈ చిత్రం రూ. 1.40 కోటి లాభాల మార్కును కూడా చేరుకుంది. తద్వారా 'బలగం' మూవీ బాక్సాఫీస్‌పై భారీ ప్రభావాన్ని చూపిస్తూ ముందుకు సాగిపోతోంది.


Click it and Unblock the Notifications











