Balagam 8 Days Collections: 8వ రోజూ భారీగానే.. నక్కతోక తొక్కిన దిల్ రాజు.. 2 లక్షలు వస్తే రికార్డు

చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగులో సహజసిద్ధమైన కథలతో సినిమాలు పెద్దగా రావన్న టాక్ ఒకటి ఉంది. అలాంటిది ఈ మధ్య కాలంలో మాత్రం నేచురల్ స్టోరీలతో ఎన్నో చిత్రాలు రూపుదిద్దుకుంటోన్నాయి. అలా వచ్చిన సినిమానే 'బలగం'. తెలంగాణలోని గ్రామీణ పరిస్థితులకు అద్దం పట్టే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా దీనికి కలెక్షన్లు అత్యధికంగా వస్తున్నాయి. అయితే, ఆరో రోజు కాస్త తగ్గినా ప్రభావాన్ని చూపించింది. మరి ఈ మూవీ ఎనిమిది రోజుల రిపోర్టును మీరే చూసేయండి!

 సహజసిద్దమైన కథతో ‘బలగం'

సహజసిద్దమైన కథతో ‘బలగం'

టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రమే 'బలగం'. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్


విభిన్నమైన కథతో రూపొందిన 'బలగం' మూవీ కాన్సెప్టు గురించి తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో అన్ని ప్రాంతాల్లో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

 8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


పల్లెటూరి సంస్కృతికి అద్దం పట్టేలా రూపొందిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆరంభం నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ చిత్రానికి భారీ వసూళ్లే వస్తున్నాయి. ఈ క్రమంలోనే 8వ రోజైన శుక్రవారం ఈ సినిమా రూ. 46 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

8 రోజులకు కలిపి ఎంతొచ్చింది

8 రోజులకు కలిపి ఎంతొచ్చింది


'బలగం' మూవీ 8 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదిరిపోయే వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 4.47 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 2.91 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 7.38 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 3.21 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా


8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.38 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం'.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి ఎనిమిది రోజుల్లో రూ. 15 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.84 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 3.28 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

 టార్గెట్ ఇలా... లాభం ఎంత?

టార్గెట్ ఇలా... లాభం ఎంత?


క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'బలగం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు రూ. 3.28 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.98 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

 మరో రెండు లక్షలు వసూలైతే

మరో రెండు లక్షలు వసూలైతే

కమెడియన్‌ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రమే 'బలగం'. మంచి కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడంతో దీని రేంజ్ పెరిగింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాలను అందించింది. ఇక, మరో రెండు లక్షలు వస్తే రూ. 2 కోట్ల మార్క్ చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X