Balagam 9 Days Collections: శనివారం సంచలన వసూళ్లు.. ఫస్ట్ డే కంటే మూడింతలు.. లాభాలతో మరో రికార్డు

స్వచ్చమైన, సున్నితమైన, నిజమైన అంశాలతో వచ్చే సినిమాలకు తెలుగు ప్రేక్షకులు మంచి ఆదరణను అందిస్తున్నారు. అందుకే ఈ తరహా చిత్రాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. అలా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీనే 'బలగం'.

తెలంగాణ ప్రాంతంలోని పల్లె సంప్రదాయాల నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు ఆరంభం నుంచే కలెక్షన్లు భారీ స్థాయిలో వసూలు అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో 'బలగం' మూవీ తొమ్మిది రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

రియల్ ఇన్సిడెంట్లతో ‘బలగం'

రియల్ ఇన్సిడెంట్లతో ‘బలగం'

ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన చిత్రమే 'బలగం'. టాలీవుడ్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్

నిజ జీవిత అంశాలతో కూడిన కథతో వచ్చిన 'బలగం' మూవీ కాన్సెప్టు గురించి తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో గ్రాండ్‌గానే విడుదలైంది.

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

మంచి పల్లెటూరి కథతో రూపొందిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు అత్యధికంగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే 9వ రోజైన శనివారం ఈ సినిమా ఏకంగా రూ. 1.77 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

9 రోజులకు కలిపి ఎంతొచ్చింది

9 రోజులకు కలిపి ఎంతొచ్చింది

9 రోజుల్లో 'బలగం' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదిరిపోయే వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 5.52 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 3.63 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 9.15 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 4.02 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో రూ. 9.15 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి తొమ్మిది రోజుల్లో రూ. 18 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.33 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 4.10 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

టార్గెట్ ఇలా... లాభం ఎంత?

మనసుకు హత్తుకునే చిత్రంగా వచ్చిన 'బలగం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక, తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు రూ. 4.10 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.80 లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

 9వ రోజు భారీగా.. మరో రికార్డు

9వ రోజు భారీగా.. మరో రికార్డు

జబర్ధస్త్ కమెడియన్‌ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రమే 'బలగం'. ఈ సినిమాకు 9వ రోజు ఏకంగా రూ. 1.77 కోట్లు గ్రాస్ వసూలైంది. తద్వారా మొదటి రోజు (55 లక్షలు) కంటే మూడింతలు ఎక్కువ వసూళ్లనే ఇది రాబట్టినట్లు అయింది. ఇక, ఈ చిత్రం ఏకంగా రూ. 2.80 కోట్లు లాభాలను సొంతం చేసుకుని మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X