Balagam Total Collections: కోటి పెడితే అన్ని కోట్లు.. బలగం సంచలనం.. దిల్ రాజు కూతురికి జాక్‌పాట్

మిగిలిన భాషల్లో మాదిరిగా నేచురల్ స్టోరీలతో తెలుగులో పెద్దగా సినిమాలు రావడం లేదు. అందుకే ఆ తరహా జోనర్లలో వచ్చే చిత్రాలకు మన ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నారు. ఇటీవలే అలా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రమే 'బలగం'. పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌తో, సహజ సిద్ధమైన క్యారెక్టర్లతో, పాత రోజులను గుర్తు చేసే సన్నివేశాలతో వచ్చిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలు సొంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో 'బలగం' మూవీ ఫుల్ రన్‌లో ఎన్ని కోట్ల వసూళ్లను రాబట్టిందో మీరే చూసేయండి!

నేచురల్ స్టోరీతో వచ్చిన బలగం:ఫేమస్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఎమోషనల్ మూవీనే 'బలగం'. ఇందులో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. భీమ్స్ దీనికి సంగీతం ఇచ్చాడు.

బలగం మూవీ బిజినెస్ డీటేల్స్:ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'బలగం' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో దీన్ని దిల్ రాజు స్టైల్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.

అలాంటి టాక్.. భారీ కలెక్షన్లతో:పూర్తి స్థాయి కుటుంబ కథతో తెరకెక్కిన 'బలగం' చిత్రానికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీకి రెస్పాన్స్ కూడా అదిరిపోయే రీతిలో వచ్చింది. అందుకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు కలెక్షన్లు భారీ స్థాయిలో. ఫలితంగా తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. తద్వారా ఈ సినిమా లాభాల బాటలో నడిచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Balagam Movie Closing Worldwide Box Office Collections

తెలుగు రాష్ట్రాల్లో ఎంతొచ్చింది:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'బలగం' మూవీ అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఫుల్ రన్‌లో ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 9.55 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ. 71 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 2.09 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 12.35 కోట్లు షేర్‌తో పాటు రూ. 26.86 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Balagam Movie Closing Worldwide Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా:తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 12.35 కోట్లు షేర్‌ను రాబట్టిన 'బలగం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి ఫుల్ రన్‌లో రూ. 20 లక్షలు షేర్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.55 కోట్లు షేర్‌తో పాటు రూ. 27.30 కోట్లు గ్రాస్‌ వసూళ్లు వచ్చాయి.

Balagam Movie Closing Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా... లాభం ఎంత?:దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన 'బలగం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.31 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో ఈ సినిమాకు రూ. 12.55 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు దిల్ రాజు కూతురికి రూ. 11.25 కోట్ల లాభాలు దక్కాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X