Akhanda day 27 collections.. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు.. కొనసాగుతున్న అఖండ ప్రభంజనం
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన అఖండ చిత్రం రికార్డులు తిరగరాస్తున్నది. 2021 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించడమే కాకుండా భారీ లాభాలను సంపాదించిన ఘనతను అఖండ సొంతం చేసుకొన్నది. డిసెంబర్ 2వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఎంత సంపాదించిందంటే..
ప్రపంచవ్యాప్తంగా అఖండ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. నైజాంలో హక్కులు 10.54 కోట్లకు, సీడెడ్‌లో 10.6 కోట్లకు, ఉత్తరాంధ్ర హక్కులు 6 కోట్లకు, తూర్పు గోదావరి జిల్లా హక్కులు 4 కోట్లకు, పశ్చిమ గోదావరి జిల్లా హక్కులు 3.5 కోట్లకు, గుంటూరు 5.4 కోట్లు, కృష్ణా జిల్లా 3.7 కోట్లకు, కృష్ణా జిల్లా 3.7 కోట్లకు, నెల్లూరు జిల్లాలో 1.8 కోట్లకు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 5 కోట్లకు, ఓవర్సీస్ 2.5 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 53 కోట్లకు బేరం జరగగా.. 54 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ పరుగు ప్రారంభించింది.
అఖండ చిత్రంలో బాలకృష్ణ నటనకు అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో భారీ వసూళ్లతో విజయఢంకా మోగించింది. గత 26 రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే.. నైజాంలో 19.77 కోట్లు, సీడెడ్‌లో 14.98 కోట్లు, ఉత్తరాంధ్రలో 6.09 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 4.07 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కోట్లు, కృష్ణా జిల్లాలో 3.53 కోట్లు, నెల్లూరు జిల్లాలో 2.57 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో చిత్రం 56.65 కోట్లు నికరంగా, 98.30 కోట్లు వసూలు చేసింది.

ఇక తెలుగేతర రాష్ట్రాల 26 రోజుల వసూలు చేసిన కలెక్షన్ల విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 4.96 కోట్లు, ఓవర్సీస్‌లో సుమారు 7.5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 70.28 కోట్లు నికరంగా, 123.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో రెండో వారాంతంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. తాజాగా అంటే 27వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషంగా మారింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా అఖండ చిత్రం 27 రోజు ముగిసే సమయానికి కలెక్షన్లు ఇలా ఉన్నాయి. 27 రోజుల్లో ఈ సినిమా 81.28 కోట్లు నికరంగా, 132.7 కోట్లు గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు 28.28 కోట్ల లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు పంచిపెట్టింది. ఇదిలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











