Bhagavanth Kesari Vs Leo బాలయ్య వర్సెస్ విజయ్.. తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద గెలుపెవరిదో తెలుసా?

దసరా కానుకగా రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య నటించిన భగవంత్ కేసరి, తమిళ సూపర్ స్టార్ నటించిన దళపతి విజయ్ లియో సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. ఇక ఈ రెండు సినిమాలు కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. సినిమా రిలీజ్ అయి వారం రోజులు అయితున్న కలెక్షన్లు మాత్రం తగ్గేదేలే అన్నట్లు వసూళ్లు రాబడుతుంది. ఇక ఈ ఇద్దరి హీరోల్లో బాక్సాఫీస్ వద్ద గెలుపు ఎవరు సాధించారో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నందమూరి నటసింహ బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. శ్రీలీల కూతురి పాత్రలో నటించింది. ఇక కాజల్ కీలక పాత్రలో నటించగా..తమన్ సంగీతం అందించాడు. ఇక ఈ మూవీకి పోటీగా విజయ్, లోకేష్ కనగరాజ్ లియో బరిలోకి దిగింది. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా.. అనిరుద్ సంగీతం అందించారు.

Balakrishna Bhagavanth Kesar and Vijay Leo Movies Day 7 Box Office Collections Full Details Here

ఇక ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. బాలయ్య వర్సెస్ విజయ్ అన్నట్లు కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. ఇక ఇప్పటికే లియో బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇద్దరి హీరోల్లో ఎవరు గెలుపు సాధించారో ఓసారి కలెక్షన్స్ లెక్కలు చూద్దాం.

భగవంత్ కేసరి తెలుగు రాష్ట్రాల 7 రోజుల కలెక్షన్స్ చూస్తే... మొదటి రోజు రూ.14.36 కోట్లు, రెండో రోజు రూ. 4.10 కోట్లు, 3వ రోజు రూ.4.62 కోట్లు, 4వ రోజు రూ.5.52 కోట్లు, 5వ రోజు రూ.4.90 కోట్లు, 6వ రోజు రూ.6.93 కోట్లు, 7వ రోజు రూ.3.56 కోట్లు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి కలెక్షన్స్ చూసుకుంటే... మొత్తంగా రూ.44.54 కోట్ల షేర్ (రూ.75.05 కోట్లు గ్రాస్) రాబట్టింది.

విజయ్ లియో మూవీ తెలుగు రాష్ట్రాల 7 రోజుల కలెక్షన్స్ చూస్తే... మొదటి రోజు రూ.8.31 కోట్లు, రెండో రోజు రూ. 3.09 కోట్లు, 3వ రోజు రూ. 3.03 కోట్లు, 4వ రోజు రూ.2.28 కోట్లు, 5వ రోజు రూ.1.68 కోట్లు, 6వ రోజు రూ.2.49 కోట్లు, 7వ రోజు రూ.1.40 కోట్లు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో లియో కలెక్షన్స్ చూసుకుంటే... మొత్తంగా రూ.22.28 కోట్ల షేర్ (రూ.40.20 కోట్లు గ్రాస్) రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి 7 రోజుల్లో రూ.44.54 కోట్ల షేర్ (రూ.75.05 కోట్లు గ్రాస్) రాబట్టింది. ఇక లియో ఏడు రోజుల్లో రూ.22.28 కోట్ల షేర్ (రూ.40.20 కోట్లు గ్రాస్) రాబట్టింది.

అయితే ఈ లెక్కన చూసుకుంటే.. లియో బాక్సాఫీస్ డీలా పడిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే... తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాల బిజినెస్ వివరాలు చూసుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి మొత్తంగా రూ.57.10 కోట్ల బిజినెస్ చేసుకుంది. అంటే రూ.58 కోట్లు సాధిస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది. ఇక లియో సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్ల బిజినెస్ చేసుకుంది. బ్రేక్ ఈవెన్ రూ. 17. కోట్లు. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసి... రూ. 5.28 కోట్ల లాభంతో దూసుకుపోతుంది. ఈ లెక్కన బాక్సాఫీస్ వద్ద తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యపై విజయ్ పైచేయి సాధించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X