Bhagavanth Kesari 19 Days Collections: బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఊచకోత... హిట్ స్టేటస్ రావాలంటే?

బాలకృష్ణ.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత చేసిన సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల ప్రధాన పాత్రలో నటించింది. ఇక కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీశ్‌ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయి 19 రోజులు గడుస్తున్నా... కలెక్షన్లు మాత్రం ఆగడం లేవు. ఇక 19వ రోజు బాక్సాఫీస్ లెక్కలు ఓసారి పరిశీలిస్తే...

నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుంది. ఇక బాలకృష్ణ వరుసగా 100 కోట్ల రూపాయలు సాధించి హ్యాట్రిక్ కొట్టేశాడు. అయితే 19వ రోజు కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Balakrishna Bhagavanth Kesari Movie 19 Days Worldwide Collections

భగవంత్ కేసరి 19 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఓసారి చూస్తే... మొదటి రోజు రూ. 14.36 కోట్లు, రెండో రోజు రూ.4.10 కోట్లు, 3వ రోజు రూ. 4.62 కోట్లు, 4వ రోజు రూ. 5.52 కోట్లు, 5వ రోజు రూ. 4.90 కోట్లు, 6వ రోజు రూ. 6.93 కోట్లు, 7వ రోజు రూ. 3.56 కోట్లు, 8వ రోజు రూ. 1.63 కోట్లు, 9వ రోజు రూ. 1.24 కోట్లు, 10వ రోజు రూ. 1.44 కోట్లు, 11వ రోజు: రూ. 2.43 కోట్లు, 12వ రోజు రూ. 12: 68 లక్షలు, 13వ రోజు రూ. 13: 54 లక్షలు, 14వ రోజు: రూ. 44 లక్షలు, 15వ రోజు రూ. 40 లక్షలు, 16వ రోజు: రూ. 25 లక్షలు, 17వ రోజు: రూ. 56 లక్షలు, 18వ రోజు: రూ. 73 లక్షలు, 18వ రోజు:రూ. 22 లక్షలు వసూలు చేసింది. ఇక తెలంగాణ ఏపీ మొత్తంగా బాలయ్య భగవంత్ కేసరి సినిమా రూ.55.09 కోట్ల షేర్ (రూ.94.15 కోట్ల గ్రాస్) రాబట్టింది

ఇక భగవంత్ కేసరి 19 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే... నైజాం రూ.18.22 కోట్లు, సీడెడ్ రూ.13.88 కోట్లు, ఉత్తర ఆంధ్ర రూ.6.27 కోట్లు, తూర్పు రూ.3.29 కోట్లు, పశ్చిమ రూ.2.71 కోట్లు,గుంటూరు రూ.5.25 కోట్లు, కృష్ణ రూ.3.02 కోట్లు, నెల్లూరు రూ.2.45 కోట్లు రాబట్టింది. ఇక తెలంగాణ ఏపీ మొత్తంగా రూ.55.09కోట్లు షేర్ ( రూ.94.15కోట్లు~ గ్రాస్) రాబట్టింది.

Balakrishna Bhagavanth Kesari Movie 19 Days Worldwide Collections

ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.5.83కోట్లు వసూలు చేయగా.. ఓవర్సీస్ లో రూ.7.26కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 68.18 కోట్లు షేర్ ( రూ.123.90కోట్లు~ గ్రాస్) వసూలు చేసి రికార్డు సృష్టించింది.

భగవంత్ కేసరి సినిమాకు మొదటి నుంచి మంచి హైప్ రావడంతో ఈ సినిమా రికార్డు బిజినెస్ నమోదు చేసుకుంది. ఈ సినిమా వ్యాపారం రూ.67.35 కోట్లకు జరిగింది. ఇక బ్రేక్ ఈవెన్ రూ.68.50 కోట్లతో బాక్సాఫీస్ వద్దకు బరిలోకి వచ్చింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే.... మరో 32లక్షలు రావాలి. అలా అయితే ఈ సినిమా హిట్ అయినట్లు తెలుస్తోంది. ఇంకో రోజులోనే ఈ కలెక్షన్లు రావడంతో.. భగవంత్ కేసరి హిట్టుగా నిలవనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X