Bhagavanth Kesari Business: భగవంత్ కేసరికి షాకింగ్ బిజినెస్.. బయోపిక్ కంటే తక్కువగా.. హిట్ కావాలంటే!

మునుపటి కంటే ఈ మధ్య కాలంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ రాకెట్ వేగంతో దూసుకుపోతోన్నారు సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు తన గత చిత్రాలు 'అఖండ', 'వీర సింహా రెడ్డి'తో ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌లను సొంతం చేసుకున్నారు. దీంతో మరింత జోష్‌తో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు బాలయ్య 'భగవంత్ కేసరి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ గురించి పూర్తి వివరాలను మీరే చూడండి!

భగవంత్ కేసరిగా వస్తున్నాడు:నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమానే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్‌ను పోషించాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేశారు.

Balakrishna Bhagavanth Kesari Movie Worldwide Pre Release Business Details

అలాంటి కథ.. నెవ్వర్ బిఫోర్:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీ తండ్రి, కూతురు సెంటిమెంట్‌తో కూడిన కథతో రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించిన విషయం తెలిసిందే. ఇక, ఈ మూవీలో నటసింహం గతంలో ఎన్నడూ చూడని పాత్రను చేశారని అంటున్నారు. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకుంటున్నారు.

రిలీజ్‌కు రెడీ.. ఫ్యాన్స్ జోష్:నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' మూవీని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఎప్పటి నుంచో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఫీవర్ మొదలైంది. ఈ సినిమా కోసం థియేటర్లను ముస్తాబు చేస్తూ.. ఫ్లెక్సీలు రెడీ చేస్తూ ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు. ఫలితంగా ఈ మూవీ సందడి వరల్డ్ వైడ్‌గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.

Balakrishna Bhagavanth Kesari Movie Worldwide Pre Release Business Details

మూవీ హక్కులు హట్ కేక్‌ల్లా:అదిరిపోయే కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'భగవంత్ కేసరి' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ నెలకొంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయని తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణలో బిజినెస్:'భగవంత్ కేసరి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 57.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Balakrishna Bhagavanth Kesari Movie Worldwide Pre Release Business Details

వరల్డ్ వైడ్ బిజినెస్ ఇలా:నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 6.00 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే ఇది హిట్ అవ్వాలంటే మాత్రం రూ. 68.50 కోట్లు రావాల్సిందే.

Balakrishna Bhagavanth Kesari Movie Worldwide Pre Release Business Details

బాలయ్య కెరీర్‌లోనే మూడోది:బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు బిజినెస్ జరిగింది. తద్వారా ఆయన కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రాల్లో ఇది మూడో స్థానానికి చేరింది. ఈ లిస్టులో 'వీర సింహా రెడ్డి' రూ. 73 కోట్లు, 'యన్.టి.ఆర్' రూ. 70 కోట్లు బిజినెస్ చేసుకుంది. వరుస హిట్లు వచ్చినా బిజినెస్ తగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X