Bhagavanth Kesari: రికార్డు స్థాయిలో భగవంత్ కేసరి బిజినెస్.. 2 నెలల ముందుగానే.. అదొక్కటే సమస్య!
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లోబల్ లయన్ గా పేరు తెచ్చుకున్న ఆయన సూపర్ ఎనర్జీతో పర్ఫామెన్స్ ఇస్తుంటారు. అలాగే యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ఆయన ఇప్పుడు భగవంత్ కేసరిగా (Bhagavanth Kesari) రానున్నారు. మరో డిఫరెంట్ లుక్ తో బాలయ్య అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ బిజినెస్ ఆసక్తికరంగా మారింది.
నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలకృష్ణ. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. యువరత్న బిరుదు నుంచి నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ పేర్లతో ఆయన్ను అభిమానులు ముద్దుగా పిలుచుకునే వారు. ఇప్పుడు గ్లోబల్ లయన్ గా పిలుస్తూ అభిమానాన్ని చాటుతున్నారు. ఇక బాలకృష్ణ సినీ కెరీర్ లో 108వ సినిమాగా వస్తున్న భగవంత్ కేసరికి కామెడీ అండ్ యాక్షన్ చిత్రాలకు పేరొందిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్న భగవంత్ కేసరి సినిమాను అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించారు. ఇందులో చందమామ కాజల్ అగర్వాల్.. బాలకృష్ణకు జోడీ కట్టనుంది. ఇక క్రేజీ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే భగవంత్ కేసరి ఓటీటీ (Bhagavanth Kesari OTT Rights) హక్కులు రూ. 18 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా ప్రచారం జరిగింది.
ఇప్పుడు భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ బిజినెస్ (Bhagavanth Kesari Pre Release Business) ఆసక్తికరంగా మారింది. థియేటర్, నాన్ థియేట్రికల్ హక్కులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. విడుదలకు రెండు నెలల ముందుగానే ప్రపంచవ్యాప్తంగా భారీ ధరకు థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. సినిమాకు నైజాం ఏరియాలో రూ. 35 కోట్లు, సీడెడ్ లో రూ. 15 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో రూ. 13 కోట్లు, ఓవర్సీస్ రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 7 కోట్లకు రైట్స్ కొనుగోలు అయింది.
ఇలా భగవంత్ కేసరి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 70 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. అయితే ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావాలంటే మాత్రం అసాధ్యమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ సారి బాలయ్య క్రేజ్, మ్యాజిక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే భగవంత్ కేసరి సినిమా వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











