Balakrishna: బాలయ్య మరో సంచలనం.. సినిమా అడ్డాలో 3 కోట్లతో అరాచకం.. టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా!
ఏజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు వరుసగా హిట్లను ఖాతాలో వేసుకుంటోన్న ఆయన.. మరింత జోష్‌తో కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు.
ఇలా 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి విజయాల తర్వాత బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీతో వచ్చారు. ఇది కూడా సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు, తాజాగా ఈ మూవీ ఓ ఫీట్‌ను సాధించింది. దీంతో బాలయ్య సంచలన రికార్డును నమోదు చేసుకున్నారు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

భగవంత్ కేసరిగా బాలయ్య: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీనే 'భగవంత్ కేసరి'. శ్రీలీల మరో ప్రధాన పాత్రలో ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన దీనిని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా చేశాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. దీనికి థమన్ సంగీతం ఇచ్చాడు.

అలాంటి టాక్ భారీ వసూళ్లు: నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో దీనికి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. ఫలితంగా ఈ మూవీకి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా ఇదే ఊపును కంటిన్యూ చేసిన ఈ సినిమా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకుని సత్తా చాటింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' మూవీ ఫుల్ రన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 56.75 కోట్లు రాబట్టింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.31 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 70.01 కోట్లు షేర్, రూ. 140 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి రికార్డు సాధించింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: సందేశాత్మక కథతో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, ముగింపు సమయానికి దీనికి రూ. 70.01 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.51 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

హ్యాట్రిక్ 70 కోట్లతో రికార్డు: నందమూరి బాలకృష్ణ వరుసగా 'అఖండ', 'వీర సింహా రెడ్డి' చిత్రాలతో హిట్లు కొట్టారు. ఈ క్రమంలోనే 'భగవంత్ కేసరి'తో ఆయన హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్నారు. అంతేకాదు, ఈ చిత్రంతో వరుసగా మూడు సార్లు రూ. 70 కోట్లు అంతకంటే ఎక్కువ షేర్ సాధించిన హీరోగా బాలయ్య చరిత్ర సృష్టించారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సీనియర్ హీరోగా మారారు.

అక్కడ మూడు సార్లు ఫీట్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ను సినిమా అడ్డాగా పిలుస్తుంటారు. అక్కడ బాలయ్య నటించిన 'అఖండ', 'వీర సింహా రెడ్డి', ఇప్పుడు 'భగవంత్ కేసరి' మూవీలు రూ. 1 కోటి గ్రాస్ మార్కును చేరుకున్నాయి. తద్వారా టాలీవుడ్‌లో ఈ రేర్ ఫీట్ సాధించిన హీరోగా బాలయ్య రికార్డు సాధించారు. అలాగే, ఈ ఘనత అందుకున్న తొలి సీనియర్ హీరోగా చరిత్ర సృష్టించారు.


Click it and Unblock the Notifications











