బాలకృష్ణను చూపెట్టే బిజినెస్ చేస్తున్నారు
బాలకృష్ణ సినిమా అంటే మినిమం ఓపినింగ్స్ ఉంటాయి. అదే సినిమా హిట్టైతే ఎక్కడికో వెళ్లిపోతుంది. దాంతో బాలకృష్ణ గెస్ట్ గా చేస్తున్నా ఆయన్నే హైలెట్ చేస్తూ ట్రైలర్స్ కట్ చేసారంటున్నారు. అది మరేదో సినిమా కాదు..ఊ కొడతారా ఉలిక్కి పడతారా. మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సెకండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర. ఉండేది కొద్ది సేపే అయినా పెదరాయుడులో రజనీకాంత్ లాగ అదరకొడతాడని చెప్తున్నారు. దాంతో బిజినెస్ కూడా బాగా స్పీడుగా జరుగుతోందని వినికిడి.
ఇక మంచు మనోజ్ సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాయి. ఈ నేఫధ్యంలో ఈ కొత్త చిత్రానికి ఎంత వరకూ ఓపినింగ్స్ వస్తాయనేది సందేహమే. అయితే ఇక్కడే బాలకృష్ణ ఆదుకుంటాడు. ఆయన సినిమా గా భావించిన నందమూరి ప్యాన్స్ ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ ఇస్తారని,అదే స్టాటజీ అని చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం ట్రైలర్ కూడా అందరిలో ఆసక్తి రేపుతోంది.
బాలకృష్ణ ఈ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ వరం' అని అన్నారు. అలాగే ఊ కొడతా రా... ఉలిక్కి పడతారా చిత్రం భారీ ఎత్తున తెరకెక్కిం దన్నారు. ఈ చిత్రాన్ని మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్నారన్నారు. తండ్రి మోహన్‌బాబు క్రమశిక్షణను పునికి పుచ్చుకున్న లక్ష్మీప్రసన్న ఈ చిత్రా న్ని ఖర్చుకు వెనుకాడకుండా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.
ఈ చిత్రం కోసం రూ.6 కోట్ల వ్యయంతో గంధర్వ మహల్ సెట్‌ను వేసినట్లు చెప్పారు. మంచు మనోజ్ మరో హీరోగా చక్కగా నటించారని బాలకృష్ణ ప్రశంసించారు. ఊ కొడతారా... ఉలిక్కి పడతారా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రం అవుతుందన్నారు. ఇక బాలకృష్ణ నటించిన అధినాయకుడు చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











