twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda day 32 collections.. బాక్సాఫీస్‌ వద్ద అఖండ కేక.. 32 రోజున తగ్గేదేలే అంటున్న బాలయ్య

    |

    టాలీవుడ్ హిస్టరీలో ఇటీవల కాలంలో 30 రోజులపాటు థియేటర్స్‌లో దుమ్మరేపిన సినిమా ఏదైనా ఉందంటే... అఖండ సినిమా గురించి చెప్పుకోవాల్సిందే. దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టించింది. స్తబ్దంగా ఉన్న బాక్సాఫీస్‌కు జోష్ పుట్టించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా థియేటర్‌కు రప్పించింది. ఇక ఇలాంటి సంచలన వసూళ్లను నమోదు చేసిన అఖండ 32 రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

    Recommended Video

    2021 Year Ender : Tollywood Top Gross Collected Movies In 2021
    అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

    అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

    అఖండ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను 10.5 కోట్ల రూపాయలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేజిక్కించుకొన్నాడు. ఇక సీడెడ్‌లో 10.6 కోట్లకు, ఉత్తరాంధ్రలో 6 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా 4 కోట్లకు, పశ్చిమ గోదావరి జిల్లా 3.5 కోట్లకు, గుంటూరు 5.4 కోట్లకు, కృష్ణా 3.7 కోట్లకు, నెల్లూరు జిల్లాలో 1.8 కోట్ల రూపాయల మేరకు హక్కులు అమ్ముడుపోయాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 45.5 కోట్ల మేరు బిజినెస్ జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 5 కోట్లకు, ఓవర్సీస్‌లో 2.5 కోట్ల రూపాయలు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 53 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది.

    బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధికంగా

    బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధికంగా

    అఖండ సినిమా థియేటర్‌లో రిలీజైన మొదటి రోజు నుంచే వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ ముందు కెళ్లింది. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుకు ఎక్కింది. 32 రోజుల కలెక్షన్లను చూస్తే.. 145 కోట్ల గ్రాస్ వసూళ్లు, 85 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇక భారీ సినిమాలు లేకపోవడం వల్ల అఖండ చిత్రం నిలకడగా కలెక్షన్లను రాబడుతున్నది.

    32వ రోజు కలెక్షన్లు ఇలా

    32వ రోజు కలెక్షన్లు ఇలా


    ఇక అఖండ 32వ రోజు కూడా సానుకూలమైన వసూళ్లను నమోదు చేసింది. ఇటీవల కాలంలో విడుదలైన తాజా చిత్రాలతో కూడా పోటీ పడుతూ మెరుగైన కలెక్షన్లను రాబట్టింది. 31వ రోజున ఈ చిత్రం 60 లక్షల షేర్‌ను సాధించింది. అలాగే 32వ రోజున తాజా సమాచారం ప్రకారం.. 40 లక్షల షేర్‌ను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ చిత్రం హవా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నదనే విషయం స్పష్టమైంది.

    32వ రోజుల టోటల్ కలెక్షన్లు ఇలా

    32వ రోజుల టోటల్ కలెక్షన్లు ఇలా


    గత 32 రోజులుగా అఖండ ఏరియా వైడ్‌గా సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో 20.25 కోట్లు, సీడెడ్‌లో 15.80 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.6.5 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 4.25 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.20 కోట్లు, గుంటూరులో 5 కోట్లు, కృష్ణా జిల్లాలో 3.9 కోట్లు, నెల్లూరులో 2.7 కోట్ల రూపాయాలను వసూలు చేసింది. దీంతో 85 కోట్లకుపైగానే కలెక్షన్లు రాబట్టింది.

    25 కోట్లకుపైగానే లాభంతో..

    25 కోట్లకుపైగానే లాభంతో..


    అఖండ చిత్రం 54 కోట్ల రూపాయల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దూకింది. అయితే కేవలం 15 రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. సుమారు 25 కోట్లకుపైగానే లాభాలను సాధించింది. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌ లాభాలను సాధించిన చిత్రంగా అఖండ రికార్డును సొంతం చేసుకొన్నది.

    English summary
    Nandamuri Balakrishna's Akhanda doing good at box office after day 32. This movie collected 85 crores net, 145 crores Gross collections worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X