"లెజెండ్'' డిస్టిబ్యూటర్స్...రేట్లు(ఏరియావైజ్)

By Srikanya

హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్వకత్వంలో వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట నిర్మిస్తున్న చిత్రం లెజెండ్. ఈ చిత్రానికి సాయికొర్రపాటి సమర్పకులు. బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే-సోనాల్ చౌహాన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్స్ తో పోస్టర్స్ తో ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకుంది. దాంతో బిజినెస్ కూడా ఓ రేంజిలో జరిగింది. ట్రేడ్ వర్గాల్లో చెప్పుకుంటున్న సమాచారం ప్రకారం బిజినెస్ డిటేల్స్...

Balakrishna's Legend Distributors & Deals

సీడెడ్ : ఎన్ వి ప్రసాద్ 7.3 Cr ( NRA మరియు తర్వాత 10% కమీషన్)

వైజాగ్ : విబిఎమ్ రెడ్డి ... 3.43Cr (NRA)

వెస్ట్ గోదావరి : కొత్త బయ్యర్లు 1.8 Cr NRA ( 2Cr కోట్లు అడ్వాన్స్ )

గుంటూరు : ఎస్ క్రియేషన్స్ 3.6 Cr NRA

నెల్లూరు : ఎన్.వి ప్రసలాద్ 1.6 Cr NRA

కృష్ణా : సొంత రిలీజ్

నైజాం & తూర్పు గోదావరి : గ్లోబుల్ మరియు వింటేజ్ ద్వారా నిర్మాతలే స్వయంగా రిలీజ్

కర్ణాటక : SLSKV ఫిల్మ్స్ మరియు ఓవర్ సీస్ : సినిమా ప్యారడైజో

గమనిక : కేవలం ఇవి ట్రేడ్ లో చెప్పబడుతున్న లెక్కలే..వీటిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అయిన బోయపాటి శ్రీను మాట్లాడుతూ... బాలయ్య బాబు స్టామినాను నిరూపించే విధంగా లెజెండ్ చిత్రం రూపొందింది.ఇటీవలే విడుదలైన లెజెండ్ ట్రైలర్, పాటలు మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ నువిశేషంగా ఆకట్టుకుంటున్నాయి. త్వరలో సెన్సార్ కు పంపనున్న లెజెండ్ చిత్రాన్ని మార్చి నెలాఖరుకు విడుదల చేయనున్నాము అన్నారు.

బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్నీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల డి.ఐ వర్క్ పూర్తి చేసుకున్న లెజెండ్ చిత్రాన్ని త్వరలో సెన్సార్ కు పంపనున్నారు.

ఈ సినిమాలో నటించిన అనుభవంతో సోనాల్ చౌహాన్ తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి ఆకసక్తి చూపుతోంది. హిందీలో జన్నత్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రం తరువాత తెలుగు లో నటించాడానికి సరైన అవకాశం రాలేదు. వరుసగా కన్నడ, హిందీ భాషల్లో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు లెజెండ్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అసలే నందమూరి బాలకృష్ణ అంటే సోనాకి చాలా గౌరవం. ఆయన సరసన హీరోయిన్ ఆ చేసిన తరువాత ఆయనకి పెద్ద ఫ్యాన్ గా మారిపోయానంది.

ఆయనతో నటించేప్పుడు ఆయన చెప్పిన కొన్ని మెలుకువలు తను ఎప్పటికీ మర్చిపోనంటుంది. లెజెండ్ చిత్రం తరువాత తెలుగు భాష అంటే సొనాలికి ప్రేమ పెరిగిందట. లెజెండ్ చిత్రం తరువాత తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని ఖచ్చితమైన నమ్మకంతో ఉంది. అంతే కాదు తెలుగు సినిమాలు చెయ్యటం తనకి చాలా ఇష్టమట ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే గుండెల్లో పెట్టుకుంటారు అంటుంది.

అలాగే ఇక్కడ నిర్మాతలు, దర్శకులు సాంకేతిక నిపుణులు చాలా మర్యాదగా వ్యవహరిస్తారంటుంది. లెజెండ్ లో తన పాత్రకి చాలా మంచి పేరు వస్తుందని హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్థానం దక్కుతుందంటుంది. అలాగే దర్శకులని బట్టి కథని బట్టి ఎలాంటి పాత్రనైనా చేస్తనంటోంది సోనాల్ చౌహాన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X