USA లో బాలయ్య 'లెజెండ్' రికార్డ్
హైదరాబాద్: శుక్రవారం విడుదలైన బాలకృష్ణ చిత్రం 'లెజెండ్' కి భారీ వసూళ్లు దక్కాయి. తొలి మూడు రోజులూ హౌస్‌ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలాడాయి. 'సింహా' రికార్డులను ఈ చిత్రం బద్దలు కొడుతోంది..' అంటూ చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా యుఎస్ లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోందని ట్రేడ్ వర్గాల సమాచారం.
మొదటి వీకెండ్ లో..2.15 కోట్లు($ 357,829) షేర్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తోంది. బాలకృష్ణ కెరీర్ లో మొదటి వీకెండ్ ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి కావటంతో అభిమానులు ఆనందోత్సాహాలతో తలములకలవుతున్నారు. ఈ చిత్రం యాభై కోట్ల మైలు రాయిని ఈజీగా చేరుకుంటుందని చెప్తున్నారు.

ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రం యూనిట్ సింహా యాత్రను చేయనున్నారు. యాత్రలో భాగంగా కొన్ని దేవాలయాలను, కొన్ని థియోటర్స్ కి వెళ్లి ప్రేక్షకులను కలవటానికి సన్నాహాలు చేస్తున్నారు. శక్తివంతమైన నాయకుడికి ప్రతిరూపంగా బాలకృష్ణ ఇందులో కనిపించారు. ప్రస్తుత సమాజ స్థితిగతుల్ని సునిశితంగా పరిశీలించి దర్శకుడు ఈ కథని సిద్ధం చేసుకున్నారు. బాలకృష్ణను 'సింహా'గా చూపించిన బోయపాటి మరోసారి ఆ స్థాయిలో చూపించారు. బాలకృష్ణ పలికే ప్రతి సంభాషణ.. అభిమానుల్ని అలరిస్తోంది.
పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందించారు. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉండటంతో మంచి స్పందన వస్తోంది, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











