బాలకృష్ణ ఓ రోజు ముందే వచ్చేస్తున్నాడు

By Srikanya

హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘లయన్'. సత్యదేవ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని మొదట మేడే సందర్భంగా మే ఒకటిన విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 30నే ఈ సినిమా విడుదలయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, డైలాగులు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కలెక్షన్లపై కన్నేసినట్టు కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారక ప్రకటన ఇంకా ఏదీ రాలేదు. రాధిక ఆఫ్టే, త్రిషలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం ‘లయన్'. షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Balakrishna's Lion gets a new release date

బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా ‘లయన్' శాటిలైట్ హక్కులు విడుదలకు ముందే అమ్ముడయ్యాయి. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ 6 కోట్లకు ‘లయన్' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

త్రిష మరియు రాధిక ఆప్టే హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను అలరించే అన్ని అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.

అటు రాజకీయంగా, ఇటు సినిమాపరంగా వరుస విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న బాలకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ గతంలో నటించిన ‘సీతారామకల్యాణం', ‘బొబ్బిలిసింహం', ‘తల్లిదండ్రులు' చిత్రాల తరహాలో మంచి హిట్ కొట్టబోతున్నామని నిర్మాత చెప్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

బాలకృష్ణ సినిమా షూటింగ్ లతో పాటు ప్రజాసేవకి కూడా సమానంగా సమయాన్ని కేటాయిస్తున్నాడు. బాలకృష్ణ ఈ సినిమా పూర్తి కాగానే శ్రీవాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా కూడా మార్చిలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X