For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రీ రిలీజ్ బిజినెస్: 'లయన్' పెద్ద హిట్టైతేనే సేఫ్..లేకపోతే కష్టం

  By Srikanya
  |

  హైదరాబాద్: మరి కొద్ది గంటల్లో బాలకృష్ణ తాజా చిత్రం 'లయన్' ఫలితం తేలనుంది. ఈ నేపధ్యంలో ... ఈ చిత్రంపై ఎంత ఖర్చు పెట్టారు...ఎంత రావాల్సి ఉంటుందనే లెక్కలు ట్రేడ్ వర్గాల్లో మొదలయ్యాయి. అంటే బాలయ్య...తనను నమ్మి పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలను ఏ మేరకు తన కలెక్షన్స్ తో ఒడ్డున పడేయాల్సి ఉంటుందనేదే ఇక్కడ విషయం. అందుతున్న సమచారం ప్రకారం ఈ చిత్రం బడ్జెట్ కు తగిన రీతిలో బిజినెస్ కాలేదనేదే.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ట్రేడ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాన్ని బట్టి... కొన్నిఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాత రమణరావు కు ఫుల్ ఎమౌంట్ కు ఇవ్వలేదు. కేవలం అడ్వాన్స్ లు మాత్రమే ఇచ్చి రిలీజ్ చేసుకుంటున్నారు. నైజాం, సీడెడ్, వైజాగ్ వదిలేస్తే..పొటిన్షియల్ ఏరియాలైన తూర్పు గోదావరి, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కేవలం కోటి, అంతకు లోపలే అడ్వాన్స్ లు ఇచ్చారని తెలుస్తోంది. ఎపి,తెలంగాణా కలిసి మొత్తం ఇరవై కోట్ల ఎనభై లక్షల వరకూ మాత్రమే డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చారని సమాచారం. మిగిలిన చోట్ల నుంచి అంటే ఓవర్ సీస్ తో కలిసి దాదాపు మూడు కోట్లు వరకూ వచ్చాయని అంటున్నారు.

  Balakrishna's Lion pre release business

  సినిమా మీద 30 కోట్లుకు పైగానే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. అయితే ఇంకా తొమ్మిది నుంచి పది కోట్లు దాకా...డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రావాల్సి ఉందని అంటున్నారు. అంటే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయితేనే రికవరీ అవుతుందన్నమాట. లెజండ్ చిత్రం నలభై కోట్లు పైగా షేర్ వసూలు చేయటంతో ...ఓ స్ధాయిలో బిజినెస్ అవుతుందని భావించారు. అయితే అనుకున్నట్లు జరగలేదు. కొత్త దర్శకుడు, ట్రైలర్స్ గొప్పగా లేకపోవటం బిజినెస్ కు మైనస్ గా మారాయి. అయితే రిలీజ్ అయ్యాక...సినిమా సూపర్ హిట్టై...తన డబ్బు వెనక్కి వస్తుందని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  చిత్రం గురించి...

  ‘‘ కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్‌లో కనపడుతుంది, నేను కొడితే..హిస్టరీలో వినబడుతుంది '' అంటూ బాలయ్య గర్జిస్తూ ఈ రోజు థియోటర్స్ కు వచ్చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న 98వ చిత్రం ‘లయన్‌'. నూతన దర్శకుడు సత్యదేవ్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

  Balakrishna's Lion pre release business

  నిజాయతీని నమ్ముకొన్న సీబీఐ అధికారి అతను. అయితే 'చట్టం తనపని తాను చేసుకుపోతుంది..' తరహా రొటీన్‌ డైలాగులు చెప్పడు. చట్టం కంటే వేగంగా స్పందిస్తాడు. న్యాయస్థానాలు, న్యాయశాస్త్రాలపై నమ్మకం ఉన్నా.. తనే ఓ న్యాయస్థానమై న్యాయమూర్తిగా తీర్పులిచ్చాడు. దుర్మార్గుల్ని శిక్షించాడు. అతని కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నందమూరి బాలకృష్ణ శక్తిమంతమైన సీబీఐ అధికారిగా భిన్నకోణాల్లో నటిస్తున్నారు. నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు.

  దర్శకుడు మాట్లాడుతూ... ''బాలకృష్ణ ఇప్పటిదాకా చేయనటువంటి కథ ఇది. ఇందులో ఆయన్ని గాడ్సే, బోస్‌ అనే రెండు పాత్రల్లో చూపించా. గాడ్సే అనే పేరుతో పాత్రని ఎందుకు సృష్టించామో తెరపైనే చూడాలి. 'లయన్‌' అన్న పేరు అభిమానుల నుంచి వచ్చిందే. తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ బాలకృష్ణ తీసుకొనే నిర్ణయాలు సాహసోపేతంగా ఉంటాయి. అందుకు 'లయన్‌' పేరు పెట్టాం. అలాగే సినిమాకోసం ఆయన తీసుకొన్న చొరవ ఆశ్చర్యం కలిగించింది. పాత్ర కోసం బరువు తగ్గాల్సి రావడంతో 4నెలలపాటు కేవలం ద్రవ పదార్థాలనే తీసుకొన్నారు. 8 కిలోలు బరువు తగ్గి సినిమాలో నటించారు. '' అని చెప్పారు.

  నిర్మాత మాట్లాడుతూ... ‘‘ ఫస్టాఫ్‌ అన్ని వర్గాల వారినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. సెకండాఫ్‌ మాస్‌ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. ఇందులోని ప్రతి సన్నివేశం, ప్రతి ఫైట్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. బాలకృష్ణగారు ఇందులో రెండు ఛాయలున్న పాత్రను చేశారు. ఒకటి సీబీఐ ఆఫీసర్‌ అయితే, మరొకటి మాస్‌ను అమితంగా ఆకట్టుకునే కేరక్టర్‌. ఆయన రఫ్‌గా కనిపించే గెట్‌పకు అభిమానుల నుంచే కాకుండా, అందరి నుంచీ సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఆయన డైలాగ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నోటివెంట వచ్చే ప్రతి పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఈలలు వేయిస్తుంది. ఆయన చేసిన ట్రైబల్‌ ఫైట్‌ సినిమా మొత్తానికీ హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే క్లైమాక్స్‌ ఫైట్‌ చాలా బాగుంటుంది. ప్రకాశ్‌రాజ్‌ ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ చేశారు. త్రిష, రాధికా ఆప్టే - ఇద్దరూ తమ అందచందాలతో, అభినయంతో ఆకట్టుకుంటారు.'' అన్నారు.

  English summary
  Lion makes nearly 30+ crores investment on Balayya, paid by distributors, while unpaid amount might be another 6-9 crores. That indicates that "Lion" should be no less than a blockbuster to recover all the invested money.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X