బాలకృష్ణ ‘లయిన్’ విడుదల తేదీ ఖరారు

By Srikanya

హైదరాబాద్ :నూతన దర్శకుడు సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ లో బాలకృష్ణ బిజీ గా వున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ కోసం ఎన్నో పేర్లు పరిశీలనకి రాగా నిర్మాతలు ‘లయిన్' అనే పేరుని ఖరారు చేసి ట్రైలర్ వదిలారు. అలాగే ఇప్పుడు విడుదల తేదీ ని సైతం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ హిట్ చిత్రం లెజండ్ విడుదల తేదీ నే అంటే మార్చి 28న ఈ కొత్త చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించికున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి వుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Balakrishna's Lion to release on March 28th ?

త్రిష మరియు రాధిక ఆప్టే హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను అలరించే అన్ని అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.

అటు రాజకీయంగా, ఇటు సినిమాపరంగా వరుస విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న బాలకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ గతంలో నటించిన ‘సీతారామకల్యాణం', ‘బొబ్బిలిసింహం', ‘తల్లిదండ్రులు' చిత్రాల తరహాలో మంచి హిట్ కొట్టబోతున్నామని నిర్మాత చెప్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X