twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలెక్షన్స్.. అజ్ఞాతవాసి, స్పైడర్ తర్వాత ఇదే!

    |

    ఎన్నో అంచనాల నడుమ బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలయింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం అంచనాలని అందుకోలేక తీవ్రంగా నిరాశపరిచింది. బాలయ్య తన తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారనే ప్రశంసలు దక్కాయి. కానీ బాలయ్య శ్రమకు తగ్గ ఫలితం మాత్రం రాలేదు. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ సినీ రంగ విశేషాలతో ఎన్టీఆర్ కథయకుడు చిత్రాన్ని రూపొందించారు. తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతూ వచ్చిన ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

    భారీ తారాగణంతో

    భారీ తారాగణంతో

    ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ తార విద్యాబాలన్ నటించింది. 9 మంది హీరోయిన్లు కామియో రోల్స్ లో నటించారు. దగ్గుబాటి రానా చంద్రబాబు పాత్రలో, నందమూరి కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో నటించారు. ఎన్టీఆర్ సబ్ రిజిస్ట్రార్ గా జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి తెలుగు దేశం పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటన చేసే వరకు తొలి భాగాన్ని క్రిష్ చూపించారు. ఎన్టీఆర్ సినిమాల్లో పోషించిన వివిధ పాత్రల్లో బాలయ్య ఒదిగిపోయి నటించడం నటించాడు.

    తొలిరోజు నుంచే షాక్

    తొలిరోజు నుంచే షాక్

    సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే ఈ చిత్రానికి షాక్ తగిలింది. అంచనాలకు తగ్గట్లుగా ఓపెనింగ్స్ నమోదు కాలేదు. డివైడ్ టాక్ పెరుగుతూ రావడంతో బాక్సాఫీస్ వద్ద కథానాయకుడు చిత్రానికి దారుణమైన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు సంక్రాంతి చిత్రాల ప్రభావం కూడా ఎన్టీఆర్ కథయకుడుపై బాగా పడింది. వినయ విధేయ రామ, ఎఫ్2, పేట చిత్రాలు కూడా సంక్రాంతికే విడుదలైన సంగతి తెలిసిందే.

    <strong>ఎన్టీఆర్ బయోపిక్: సింగిల్ వర్డ్‌తో అందరి నోటికి తాళం వేసిన తేజ.. ఏమన్నారంటే?</strong>ఎన్టీఆర్ బయోపిక్: సింగిల్ వర్డ్‌తో అందరి నోటికి తాళం వేసిన తేజ.. ఏమన్నారంటే?

    లెక్క తేలింది

    లెక్క తేలింది

    ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర బాక్సాఫీస్ రన్ ముగిసింది. భారీ నష్టాలతో ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్స్ నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం 20.62 కోట్ల షేర్ సాధించింది. నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో బయ్యర్లు 10 కోట్లకు పైగా నష్టపోయారు. గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ లో బయ్యర్లు 3 కోట్లకు పైగా నష్టాల్ని చవిచూశారు. టాలీవుడ్ లో అత్యధిక స్థాయిలో నష్టాల్ని మిగిల్చిన చిత్రాల జాబితాలో ఎన్టీఆర్ కథానాయకుడు కూడా చేరింది.

    50 కోట్ల నష్టం

    50 కోట్ల నష్టం

    ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై ఉన్న అంచనాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 71 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. కేవలం 20 కోట్లు మాత్రమే రాబట్టడంతో 50 కోట్ల నష్టం వాటిల్లింది. అజ్ఞాతవాసి, స్పైడర్ చిత్రాలు తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రంగా నిలిచింది. నైజాం ఏరియాలో 13 కోట్లకు ఈ చిత్ర హక్కులు అమ్ముడు కాగా కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. సీడెడ్ లో 12 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్మారు. కేవలం 1.8 కోట్లు మాత్రమే తిరిగి రాబట్టింది.

    ఎన్టీఆర్ మహానాయకుడుపై ప్రభావం

    ఎన్టీఆర్ మహానాయకుడుపై ప్రభావం

    ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విజయం సాధించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ నిరాశపరచడంతో ఆ ప్రభావం ఎన్టీఆర్ మహానాయకుడుపై కూడా పడనుంది. ఈ చిత్రం విషయంలో బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంతో బయ్యర్లంతా దారుణంగా నష్టపోయారు. వారందరికీ ఎన్టీఆర్ మహానాయకుడు హక్కులు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఎంతుందో తేలాల్సి ఉంది.

    English summary
    Balakrishna's NTR Kathanayakudu closing collections. Biggest disaster after Agnathavasi and Spyder
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X