Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Ruler 10days Collections: షాకింగ్‌గా బాలయ్య మూవీ కలెక్షన్లు.. పరిస్థితి చూస్తే కష్టంగానే..
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన రూలర్ చిత్రం రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద తంటాలు పడుతున్నది. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను, సినీ విమర్శలకు మెప్పించలేదనే టాక్ మధ్య ఓ మోస్తారు కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం 10 రోజుల తర్వాత ఎంత సాధించిందంటే..
10వ రోజున కలెక్షన్లు
రూలర్ చిత్రం 10వ రోజున సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి. పదో రోజున ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.19 లక్షలు, ప్రపంచవ్యాప్తంగా రూ.20 లక్షల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత పది రోజుల్లో రూ.7.93 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.9.63 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఏరియాల వారీగా వసూళ్లు
ఇక పదో రోజు కలెక్షన్లు ప్రాంతాల వారీగా, ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి. నైజాంలో 10వ రోజున ఈ చిత్రం రూ.9 లక్షలు, సీడెడ్‌లో రూ.4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.80 వేలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.5 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 1 లక్ష, గుంటూరులో రూ.90 వేలు, కృష్ణా జిల్లాలో రూ.1 లక్ష, నెల్లూరులో రూ.60 వేల వసూళ్లు సాధించింది. దాంతో ఏపీ, తెలంగాణలో 19 లక్షలుగా వసూళ్లు నమోదయ్యాయి.
10 రోజుల్లో ఎంతంటే
గత 10 రోజుల్లో నైజాంలో రూలర్ చిత్రం రూ.1.96 కోట్లు, సీడెడ్‌లో రూ.2.11 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.58 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ..52 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 44 లక్షలు, గుంటూరులో రూ.1.52 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.44 లక్షలు, నెల్లూరులో రూ.36 లక్షలు వసూళ్లు సాధించింది.
కర్ణాటక, ఓవర్సీస్లో
గత 10 రోజుల్లో ఏపీ, తెలంగాణ రూ.7.93 కోట్లు వసూలు చేసింది. ఇక ఏపీ, తెలంగాణేత రాష్ట్రాల్లో చూసుకొంటే.. కర్ణాటక, ఇతర రాస్ట్రాల్లో రూ.1.14 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో రూ.56 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా రూ.16.92 కోట్ల గ్రాస్ వసూళ్లను, రూ.9.63 కోట్ల షేర్‌ను సాధించింది.
రూలర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇంకా ఎంత రావాలంటే..
రూలర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం హక్కులను రూ.5.3 కోట్లకు, సీడెడ్ రూ.5.2 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.2.5 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.1.55 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.1.4 కోట్లు, గుంటూరులో రూ.2.7 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.1.1 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఏపీ తెలంగాణలో మొత్తంగా రూ21.25 కోట్లు మేర, కర్టాటక, మిగితా రాష్ట్రాల్లో రూ.2.20 కోట్లు, ఓవర్సీస్లో రూ.30 లక్షలతో కలిపి మొత్తంగా 23.75 కోట్ల బిజినెస్ జరిగింది. ఇంకా లాభాల్లోకి రావాలంటే సుమారు ఇంకా 7 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది.