For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ ‘శ్రీమన్నారాయణ’కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

  By Srikanya
  |

  హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా, రవి చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మించిన 'శ్రీమన్నారాయణ' క్రిందటి శుక్రవారం విడుదల అయిన సంగతి తెలిసిందే. డివైడ్ టాక్ తో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మొదటి మూడు బాగుందని ట్రేడ్ టాక్. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 8.65 కోట్లు నెట్ కలెక్టు చేసిందని చెప్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ తొలిసారిగా జర్నలిస్టు గా చేసారు. ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ బేనర్‌పై రమేశ్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మించారు. రవికుమార్ చావలి దర్శకుడు.

  విడుదలైన అన్ని చోట్లా సింగిల్ స్క్రీన్స్ లో ఎనభై నుంచి వంద శాతం వరకూ ఆక్యుపెన్సీ ఉందని సమాచారం. అయితే ఎనిమిది కోట్ల చిల్లర కలెక్టు చేసిందనేది నిజమైతే బాలయ్య చిత్రాల ఓపినింగ్స్ లో ఇది రికార్డే. ఇంతకుముందు వచ్చిన అధినాయకుడు చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫరవాలేదనే టాక్ తెచ్చుకున్నా మొదటిరోజు 7.2 కోట్లు కలెక్టు చేసింది. ఆ రికార్జుని ఈ చిత్రం బ్రద్దలు కొట్టింది.

  అయితే నిజానికి ఈ రోజు నుంచి అంటే సోమవారం నుంచీ ఈ చిత్రం ఎంత కలెక్టు చేస్తుంది అన్న దానిపై బిజినెస్ లెక్కలు ఉంటాయి. మరో ప్రక్క ఈ చిత్రానికి పోటీగా విడుదలైన రెండు డబ్బింగ్ చిత్రాలు ఓకే ఓకే,మాస్క్ పెద్దగా ఓపినింగ్స్ తెచ్చుకోలేకపోయాయి. మాస్క్ చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోగా,ఓకే ఓకే చిత్రం ఓకే అనిపించుకుంది. కాబట్టి ఈ రెండు చిత్రాల వైపు నుంచి శ్రీమన్నారాయణకు పోటీ లేనట్లే.

  ఈ చిత్రం ప్రమేషన్ లో బాలకృష్ణ సైతం ఎన్నడూ లేని విధంగా చాలా బిజీగా మీడియా ఛానెల్స్ లో కనపడుతున్నారు. బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.

  English summary
  Nandamuri Balakrishna's latest release Srimannarayana has fetched a fare amount on the first day of its release. As per the early reports, the film has beaten the collection record of Balayya's previous release Adhinayakudu, which was released earlier this year. Srimannarayana, which hit the screens across the globe on August 30, registered 80% to 100% occupancy in single screens, while it had an above average response at multiplexes. The movie has raked in Rs 8.65 crores nett at the worldwide Box Office.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X