వాటితో పోలిస్తే 'సింహా' నే నెంబర్ వన్ (ట్రేడ్‌ట్రాక్)
క్రిందటి వారం తెలుగు తెరను ఐదు చిత్రాలు పలకరించాయి. అవి రామ్, అర్జున్ కాంబినేషన్ 'రామ రామ కృష్ణ కృష్ణ", చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'అందరి బంధువయ", దాసరి నారాయణ రావు అందరూ కొత్త ఆర్టిస్టులతో రూపోందించిన 'యంగ్ ఇండియా", ఆకాష్ హీరోగా 'ఆహా..ఎంత అందం", నూతన తారలతో నిర్మించిన 'తెలియదు" చిత్రాలు. ఈచిత్రాల్లో 'అందరి బంధువయ" మానవతావిలువలు ఉన్న చిత్రంగా పేరుతెచ్చుకుంది కానీ కలెక్షన్స్ తెచ్చుకోలేకపోతోంది. మిగతా వాటి పరిస్ధితి ఆ మాత్రం కూడా లేదు.
ఇక రామ్ హీరోగా వచ్చిన లక్ష్యం వాసు రూపొందించిన 'రామ రామ కృష్ణకృష్ణ" చిత్రం బంగారుబుల్లోడు, భాషా చిత్రాల కలగలపుగా ఉందని ప్రేక్షకుల పెదవివిరుస్తున్నారు. అలాగే చాలాగ్యాప్ తో వచ్చిన దాసరి 'యంగ్ ఇండియా" అయితే మరో చెత్త గా అభివర్ణిస్తున్నారు. దాదాపు అందరూ తెలుగు నటులతో, పైగా కొత్త నటీనటులతో తీసిన ఈ చిత్రం మొదటి రోజు మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. దాసరి ఇంతకుముందు తీసిన మేస్ర్తీ తరహాలోనే ఏదో చెప్పాలనే తాపత్రయం తప్పితే ఏ విషయం సస్టైన్ చేయలేదని అంటున్నారు.
ఇక ఆకాష్ 'అహా.. ఎంత అందం", 'తెలియదు" చిత్రాల గూర్చి మాట్లాడేవారు కరువయ్యారు. చాలా మందికి ఇవి రిలీజ్ అయిన విషయం కూడా తెలియదు. ఇక పై వారం రిలీజైన 'సూపర్ కౌబాయ్", 'హాసిని", కారా..మజాకా, ఒక్క క్షణం, చిత్రాల పూర్తి స్ధాయి ప్లాఫ్ లుగా నమోదు చేసుకున్నాయి. మరోప్రక్క ఈ యేటి మేటి బ్లాక్ బస్టర్ గా అభివర్ణిస్తున్న సింహా కలెక్షన్లు తగ్గటం జరిగింది. అయితే వీటిన్నటి కలెక్షన్స్ తో పోలీస్తే ఆ చిత్రమే నెంబర్ వన్.


Click it and Unblock the Notifications











