Bhagavanth Kesari 10 Days Collections: బాలయ్య మరో సంచలనం.. అన్ని కోట్ల ఊచకోత.. ఏకైక హీరోగా రికార్డు
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుని.. సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆయన.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు.
ఇలా ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే సినిమాతో వచ్చారు. దీనికి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీగా వస్తోంది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు అనుకున్నట్లుగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' మూవీ 10 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి!

విజ్జి పాపతో వచ్చేసిన భగవంత్: నందమూరి బాలకృష్ణ హీరోగా.. శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ సినిమానే 'భగవంత్ కేసరి'. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేశారు. దీనికి థమన్ సంగీతం అందించాడు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్: 'భగవంత్ కేసరి'కి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ అయింది.

10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'భగవంత్ కేసరి'కి ఏపీ, తెలంగాణలో 10వ రోజూ రెస్పాన్స్ బాగా పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 50 లక్షలు, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో కలిపి.. రూ. 1.44 కోట్లు షేర్, రూ. 2.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
10 రోజులకూ కలిపి ఎంతంటే?: 10 రోజుల్లో 'భగవంత్ కేసరి'కి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 15.72 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.63 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.47 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.83 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.41 కోట్లు, గుంటూరులో రూ. 4.93 కోట్లు, కృష్ణాలో రూ. 2.68 కోట్లు, నెల్లూరులో రూ. 2.18 కోట్లతో కలిపి.. రూ. 48.85 కోట్లు షేర్, రూ. 82.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 48.85 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.50 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 60.10 కోట్లు షేర్, రూ. 113 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఫాదర్ - డాటర్ సెంటిమెంట్‌తో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 60.10 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 8.40 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.

మరో హ్యాట్రిక్‌తో సంచలనం: నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన 'భగవంత్ కేసరి' మూవీకి రెస్పాన్స్ భారీగానే వస్తోంది. ఫలితంగా ఈ సినిమా 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 60.10 కోట్లు రాబట్టింది. దీంతో వరుసగా మూడు సార్లు రూ. 60 కోట్లు షేర్ రాబట్టిన ఏకైక సీనియర్ హీరోగా బాలయ్య రికార్డు సాధించారు. గతంలో అఖండ, వీర సింహా రెడ్డి 60 కోట్లు పైగా రాబట్టాయి.


Click it and Unblock the Notifications











