Bhagavanth Kesari 11 Days Collections: సండే ఊచకోత.. బాలయ్య మరో సెన్సేషన్.. అన్ని కోట్లతో రికార్డు
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ.. దాదాపు నలభై ఏళ్లుగా స్టార్ హీరోగా సత్తా చాటుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆ మధ్య వరుస ఫ్లాపులతో సతమతం అయినా.. ఇటీవలి కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు.
ఈ ఉత్సాహంతోనే ఇటీవలే 'భగవంత్ కేసరి' మూవీ చేశారు. దీనికి టాక్‌తో పాటు కలెక్షన్లు బాగా వస్తున్నాయి. రెండో వారంలోనూ ఈ సినిమా సత్తా చాటుతూనే వెళ్తోంది. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' మూవీ 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూడండి మరి!

ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తోనే: నందమూరి బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఫాదర్ డాటర్ సెంటిమెంట్ సినిమానే 'భగవంత్ కేసరి'. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేశారు. దీనికి థమన్ సంగీతం ఇచ్చాడు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్: 'భగవంత్ కేసరి'కి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ జరిగింది.

11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'భగవంత్ కేసరి'కి ఏపీ, తెలంగాణలో 11వ రోజూ రెస్పాన్స్ బాగా పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 80 లక్షలు, సీడెడ్‌లో రూ. 51 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 41 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి.. రూ. 2.43 కోట్లు షేర్, రూ. 4.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
11 రోజులకూ కలిపి ఎంతంటే?: 'భగవంత్ కేసరి'కి 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 16.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.88 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.06 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.54 కోట్లు, గుంటూరులో రూ. 5.03 కోట్లు, కృష్ణాలో రూ. 2.80 కోట్లు, నెల్లూరులో రూ. 2.31 కోట్లతో కలిపి.. రూ. 51.28 కోట్లు షేర్, రూ. 87.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: 11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 51.28 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.85 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 11 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.18 కోట్లు షేర్, రూ. 127 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: మంచి సెంటిమెంట్‌తో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 63.18 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 5.32 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లు: టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన 'భగవంత్ కేసరి' మూవీకి రెస్పాన్స్ భారీగానే వస్తోంది. ఫలితంగా ఈ సినిమా 11 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ చిత్రం రూ. 51.28 కోట్లు వసూలు చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు సార్లు రూ. 50 కోట్లు వసూలు చేసిన హీరోగా బాలయ్య రికార్డును క్రియేట్ చేశారు.


Click it and Unblock the Notifications











