Bhagavanth Kesari 12 Days Collections: ఒక్కసారిగా డౌన్.. బేబీ కంటే తక్కువగా.. చిరంజీవి రికార్డు సేఫ్
వరుసగా 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ జోష్‌లోనే ఆయన ఇటీవలే 'భగవంత్ కేసరి' అనే సినిమాతో వచ్చారు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు మంచి రెస్పాన్స్‌ను ఇస్తున్నారు. ఇలా ఈ మూవీ రెండో వారంలోనూ అదిరిపోయే వసూళ్లను సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ 12 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి!
బాలయ్య కెరీర్‌లో నెవ్వర్ బిఫోర్:నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే నెవర్ బిఫోర్ మూవీగా వచ్చిందే 'భగవంత్ కేసరి'. శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. దీనికి థమన్ సంగీతం ఇచ్చాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేశారు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్:'భగవంత్ కేసరి'కి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ అయింది.
12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా:'భగవంత్ కేసరి'కి ఏపీ, తెలంగాణలో 12వ రోజు రెస్పాన్స్ పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 68 లక్షలు షేర్, రూ. 1.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

12 రోజులకూ కలిపి ఎంతంటే?:'భగవంత్ కేసరి'కి 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 16.76 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.96 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.11 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.58 కోట్లు, గుంటూరులో రూ. 5.08 కోట్లు, కృష్ణాలో రూ. 2.85 కోట్లు, నెల్లూరులో రూ. 2.34 కోట్లతో కలిపి.. రూ. 51.96 కోట్లు షేర్, రూ. 88.25 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 12 రోజుల్లో రూ. 51.96 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.90 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 12 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.96 కోట్లు షేర్, రూ. 129 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:సందేశాత్మక కథతో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 63.96 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.54 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.
బేబి రికార్డును దాటేలేదుగా:టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన 'భగవంత్ కేసరి' మూవీకి రెస్పాన్స్ భారీగానే వస్తోంది. దీంతో ఈ చిత్రం ఆంధ్రా, తెలంగాణలో కలిపి వరుసగా 11 రోజుల పాటు కోటి రూపాయలు, అంతకంటే ఎక్కువ షేర్ రాబట్టింది. దీంతో 'బేబి', 'జైలర్', 'వాల్తేరు వీరయ్య' 12 రోజుల రికార్డును ఈ సినిమా చేరుకోలేదు.


Click it and Unblock the Notifications











