Bhagavanth Kesari 13 Days Collections: మరింత పడిన కేసరి వసూళ్లు.. ఇంకెన్ని కోట్లు వస్తే హిట్ అంటే!
టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలలో వరుసగా విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో సత్తా చాటుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఉత్సాహంతోనే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇటీవలే బాలయ్య 'భగవంత్ కేసరి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగా లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు వసూళ్లు పోటెత్తుతున్నాయి. అయితే, ఇప్పుడు క్రమంగా డౌన్ అవుతున్నాయి. మరి 'భగవంత్ కేసరి' మూవీ 13 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దామా!
ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చింది: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎమోషనల్ కంటెంట్ మూవీనే 'భగవంత్ కేసరి'. శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేశారు. దీనికి థమన్ సంగీతం ఇచ్చాడు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్: 'భగవంత్ కేసరి'కి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ చేసుకుంది.
13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'భగవంత్ కేసరి'కి 13వ రోజు ఏపీ, తెలంగాణలో రెస్పాన్స్ పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 54 లక్షలు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

13 రోజులకూ కలిపి ఎంతంటే?: 13 రోజుల్లో 'భగవంత్ కేసరి'కి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 16.96 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.39 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.15 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.61 కోట్లు, గుంటూరులో రూ. 5.12 కోట్లు, కృష్ణాలో రూ. 2.89 కోట్లు, నెల్లూరులో రూ. 2.36 కోట్లతో కలిపి.. రూ. 52.50 కోట్లు షేర్, రూ. 89.25 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 13 రోజుల్లో రూ. 52.50 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.14 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.96 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 13 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 64.60 కోట్లు షేర్, రూ. 140 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో దీనికి రూ. 64.60 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 3.90 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.
ఇదే కంటిన్యూ అవ్వాలంటూ: టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన 'భగవంత్ కేసరి' మూవీకి రెస్పాన్స్ క్రమంగా డౌన్ అవుతోంది. ముఖ్యంగా వీక్ డేస్‌లో ఈ సినిమా అనుకున్న రీతిలో రాణించడం లేదు. అయినప్పటికీ టార్గెట్‌ను చేరాలంటే ఇదే రేంజ్‌ను కంటిన్యూ చేస్తే సరిపోతుందని ట్రేడ్ వర్గాల వాళ్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











