Bhagavanth Kesari 15 Days Collections: మరింత పడిపోయిన వసూళ్లు.. హిట్‌కు అన్ని కోట్లు బ్యాలెన్స్
పేరుకు సీనియర్ హీరోనే అయినా కుర్రాళ్లకు ధీటుగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. గతంలో కాస్త ఇబ్బంది పడినా.. ఈ మధ్యన వరుసగా హిట్లను సాధిస్తూ సత్తా చాటుతోన్నారు. ఈ ఉత్సాహంతోనే బాలయ్య ఇటీవలే 'భగవంత్ కేసరి' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దీనికి మొదట్లోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగా వచ్చింది. కానీ, రెండో వారం నుంచి ఇది క్రమంగా డౌన్ అవుతోంది. మరి 'భగవంత్ కేసరి' మూవీ 15 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో చూడండి!
ఎమోషనల్‌గా భగవంత్ కేసరి:నందమూరి బాలకృష్ణ హీరోగా.. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎమోషనల్ మూవీనే 'భగవంత్ కేసరి'. శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేశారు. దీనికి థమన్ సంగీతం సమకూర్చాడు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్:'భగవంత్ కేసరి'కి నైజాంలో రూ. 15.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్‌ను చేసుకుంది.
15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
'భగవంత్ కేసరి'కి 15వ రోజు ఏపీ, తెలంగాణలో రెస్పాన్స్ మరింత తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 40 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

15 రోజులకూ కలిపి ఎంతంటే?
15 రోజుల్లో 'భగవంత్ కేసరి'కి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 17.32 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.56 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.12 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.64 కోట్లు, గుంటూరులో రూ. 5.17 కోట్లు, కృష్ణాలో రూ. 2.94 కోట్లు, నెల్లూరులో రూ. 2.39 కోట్లతో కలిపి.. రూ. 53.34 కోట్లు షేర్, రూ. 90.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 53.34 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.68 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.18 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 15 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 66.20 కోట్లు షేర్, రూ. 120 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లో దీనికి రూ. 66.20 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.30 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











